Share News

Crime: బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆలోచన.. కానీ ఇంతలోనే దారుణం..

ABN , Publish Date - Feb 09 , 2024 | 09:51 AM

ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణహత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల పరంగా తేడాలు రావడంతో కిరాయి మనుషులతో కలిసి స్నేహితుడే ఈ షూతుకానికి పాల్పడ్డాడు. పథకం ప్రకారం మహిళతో ఫోన్ చేసి పిలిపించి, మర్మాంగాలు కోసి మరి చంపేశాడు.

Crime: బడా రియల్ ఎస్టేట్ వ్యాపారి.. లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ నుంచి పోటీ చేయాలని ఆలోచన.. కానీ ఇంతలోనే దారుణం..

జూబ్లీహిల్స్: నాగర్‌కర్నూల్ జిల్లాకు చెందిన ఓ వ్యక్తి రియల్ ఎస్టేట్‌ రంగంలో బడా వ్యాపారిగా ఎదిగాడు. సొంత ఊరి నుంచి హైదరాబాద్ వరకు తన వ్యాపారాన్ని విస్తరించాడు. డబ్బు, పలుకుబడి బాగా ఉండడంతో రానున్న లోక్‌సభ ఎన్నికల్లో నాగర్‌కర్నూల్ నుంచి బీజేపీ తరఫున పోటీ చేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు. కానీ ఇంతలోనే దారుణం జరిగింది. సదరు రియల్ ఎస్టేట్ వ్యాపారి దారుణ హత్యకు గురయ్యాడు. ఆర్థిక లావాదేవీల పరంగా తేడాలు రావడంతో కిరాయి మనుషులతో కలిసి స్నేహితుడే ఈ షూతుకానికి పాల్పడ్డాడు. పథకం ప్రకారం మహిళతో ఫోన్ చేసి పిలిపించి, మర్మాంగాలు కోసి మరి చంపేశాడు. మృతుడు నాగర్‌కర్నూల్ జిల్లా కొల్లాపూర్ సమీపంలోని సింగోటం గ్రామానికి చెందిన పుట్ట రాము అలియాస్ సింగోటం రామన్న (35 )గా గుర్తించారు.


పూర్తి వివరాల్లోకి వెళ్తే.. రాము ఒక వ్యాపారి. అదనపు ఆదాయం కోసంరియల్ ఎస్టేట్ రంగంలోకి అడుగుపెట్టాడు. నాగర్‌కర్నూల్ నుంచి కుత్బుల్లాపూర్ వరకు రియల్ ఎస్టేట్ వ్యాపారాన్ని విస్తరించాడు. కుటుంబసభ్యులను గ్రామంలోనే ఉంచి రాము మాత్రం బషీరాబాద్‌లో ఓ విల్లాలో ఉంటున్నాడు. కొల్లాపూర్ ప్రాంతంలో అబ్దుల్ కాలం ఫౌండేషన్ పేరుతో సేవ సంస్థను ఏర్పాటు చేసి పలు సామాజిక కార్యక్రమాలు చేస్తున్నాడు. తర్వాత బీజేపీలో చేరి రానున్న లోక్‌సభ ఎన్నికల్లో పోటీచేయాలనే ఆలోచనలో కూడా ఉన్నాడు. వ్యాపారాన్ని మరింత విస్తరించే క్రమంలో మణికంఠ అనే వ్యక్తితో రాముకు పరిచయం ఏర్పడింది. అతడితో వ్యాపార లావాదేవీలు పెరగడంతో సన్నిహిత సంబంధాలు కూడా ఏర్పడ్డాయి. ఇద్దరు కలిసి యూసఫ్‌గూడలోని ఎల్‌ఎన్‌నగర్‌లో ఓ మహిళ వద్దకు వెళ్తండేవారు. అక్కడే పేకాట ఆడడం, మద్యం సేవించడం వంటివి చేస్తుండేవారు.

ఇక్కడి వరకు అంతా బాగానే ఉంది. ఇప్పుడే అసలు కథ ప్రారంభమైంది. వ్యాపార లావాదేవీల విషయంలో రాము, మణికంఠ మధ్య విబేధాలు తలెత్తాయి. ఇవి పరస్పరం దాడులు చేసుకునే దాకా వెళ్లాయి. పరస్పరం కేసులు కూడా పెట్టుకున్నారు. రాము మీద కక్ష పెంచుకున్న మణికంఠ అతడిని హత్య చేసేందుకు పథకం పన్నాడు. ఇందుకోసం బోరబండకు చెందిన రౌడీ షీటర్‌కు సుపారీ ఇచ్చాడు. ఆ రౌడీ షీటర్ కొంత మంది తన అనుచరులను సిద్ధం చేసుకున్నాడు. పథకం ప్రకారం మణికంఠ ఎల్‌ఆన్‌నగర్‌లోని మహిళ ఇంటికి వెళ్ళాడు. ఆమెతో రాముకు ఫోన్ చేయించి పిలిపించాడు.

బుధవారం రాము మహిళ ఇంటికి వచ్చి మద్యం తాగుతుండగా మణికంఠతో పాటు మరో తొమిది మంది కత్తులు, ఇతరత్రా ఆయుధాలతో అక్కడికి వచ్చారు. రాముపై విచక్షణా రహితంగా దాడి చేశారు. అతడి మర్మంగాలను కోసేశారు. దీంతో రక్తపు మడుగుల్లో పడి రాము విలవిలలాడాడు. రాము మృతి చెందాడని నిర్ధారించుకున్న తర్వాతే నిందితులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. స్థానికుల సమాచారంతో అర్ధరాత్రి దాటిన తర్వాత జూబ్లీహిల్స్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకున్నారు. క్ల్యూస్ టీమ్ సభ్యులు ఘటనా స్థలానికి చేరుకుని ఆధారాలు సేకరించారు. రాము కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. అయితే ఆధారాలతో మణికంఠతోపాటు రౌడీ షీటర్ పోలీసుల ముందు లొంగిపోయినట్లు సమాచారం.

Updated Date - Feb 09 , 2024 | 10:45 AM