Share News

FBI: ఈ వ్యక్తిని పట్టుకుంటే రెండు కోట్ల రూపాయల రివార్డ్.. FBI ఆఫర్

ABN , Publish Date - Apr 13 , 2024 | 09:17 AM

మీరు ఈజీగా రెండు కోట్లకుపైగా సంపాదించాలని చుస్తున్నారా. అయితే మీకు మంచి ఛాన్స్ ఉంది. ఓ వ్యక్తి గురించి మీరు సమాచారం తెలిపి అతన్ని పట్టిస్తే మీకు రెండు కోట్ల రూపాయలు ఇస్తారు. అవును మీరు విన్నది నిజమే. కానీ ఇది ఇండియాలో కాదు. అమెరికాలో పోలీసులకు సమాచారం అందించాలి.

FBI: ఈ వ్యక్తిని పట్టుకుంటే రెండు కోట్ల రూపాయల రివార్డ్.. FBI ఆఫర్
Federal Bureau of Investigation

మీరు ఈజీగా రెండు కోట్లకుపైగా సంపాదించాలని చుస్తున్నారా. అయితే మీకు మంచి ఛాన్స్ ఉంది. ఓ వ్యక్తి గురించి మీరు సమాచారం తెలిపి అతన్ని పట్టిస్తే మీకు రెండు కోట్ల రూపాయలు ఇస్తారు. అవును మీరు విన్నది నిజమే. కానీ ఇది ఇండియాలో కాదు. అమెరికా(america)లో పోలీసులకు సమాచారం అందించాలి. అమెరికాకు చెందిన ఫెడరల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (FBI) మోస్ట్ వాంటెడ్ పరారీలో ఉన్న 10 మందిలో ఒకరైన భద్రేష్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్‌పై ఈ రివార్డ్ డబ్బును ప్రకటించింది.

అతనిని పట్టుకోవడంలో ఎవరైనా సహాయం చేస్తే 250,000 డాలర్ల రివార్డ్(2,09,02,825 రూపాయలు) ఇవ్వబడుతుందని సోషల్ మీడియా వేదికగా వెల్లడించింది. గతేడాది వరకు చేతన్‌పై లక్ష డాలర్ల రివార్డు మాత్రమే ఉండేది. అతని భార్యను హత్య చేసిన కేసులో పటేల్‌ను అక్కడి పోలీసులు వెతుకుతున్నారు. అతను ఏప్రిల్ 12, 2015న మేరీల్యాండ్‌ హనోవర్‌లోని డోనట్ దుకాణంలో ఈ హత్యకు పాల్పడ్డాడు. అయితే అప్పటి నుంచి అతడు పరారీలో ఉన్నాడు.


భద్రేష్‌కుమార్ చేతన్‌భాయ్ పటేల్ ఎవరు?

గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లోని విరామ్‌గాం నివాసి భద్రేష్ కుమార్ పటేల్. 1990లో జన్మించిన భద్రేష్ తన ప్రారంభ జీవితంలో 24 సంవత్సరాలు ఈ నగరంలోనే గడిపాడు. ఒకరోజు అమెరికా వెళ్లాలని నిర్ణయించుకున్నాడు. 2015లో పాలక్ పటేల్ అనే అమ్మాయిని పెళ్లాడాడు. పెళ్లయిన వెంటనే భద్రేష్, పాలక్ అమెరికా చేరుకున్నారు. జీవనోపాధి కోసం వారిద్దరూ మేరీల్యాండ్ రాష్ట్రంలోని హనోవర్‌లోని డంకిన్ డోనట్స్ కాఫీ షాప్‌లో పని చేయడం ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఏప్రిల్ 12, 2015న షాపులోని వంట గది దగ్గర పాలక్ మృతదేహం పడి ఉంది. పోలీసులు వచ్చే సరికి భద్రేష్‌కుమార్‌ కనిపించకుండా పోయాడు.


పోలీసులు సీసీటీవీ ఫుటేజీని పరిశీలించగా భద్రేష్ నిజస్వరూపం బయటపడింది. భద్రేష్ బంధువులను పోలీసులు విచారించగా పాలక్ అమెరికా నుంచి ఇండియాకు రావాలనుకుందని తెలిపారు. కానీ భద్రేష్ మాత్రం అమెరికాలో స్థిరపడి అక్కడి పౌరసత్వం తీసుకోవాలనే తపనతో ఉన్నాడు. ఇద్దరూ ఆ విషయంలో వాదించుకుని గొడవ పడ్డారు. ఆ తర్వాత వంటగదిలో భద్రేష్, పాలక్ మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది. అప్పుడు షాపులో కస్టమర్లు కూడా ఉన్నారు. అయినా కూడా భద్రేష్ తన 21 ఏళ్ల భార్య పాలక్‌పై కత్తితో దాడి చేసి హత్య చేశాడు. పాలక్‌ను చంపిన తర్వాత భద్రేష్ అమెరికా నుంచి అదృశ్యమయ్యాడు. హత్యకు నెల రోజుల ముందు దంపతుల వీసా గడువు ముగిసింది.


భద్రేష్ ఎక్కడికి వెళ్లాడు?

హత్య చేసిన తర్వాత భద్రేష్ పటేల్ నేరుగా తన అపార్ట్‌మెంట్‌కు వచ్చి కొన్ని పత్రాలతో క్యాబ్‌లో వెళ్లిపోయాడని విచారణలో తేలింది. మానవ స్మగ్లర్ల సహాయంతో పటేల్ అమెరికా పారిపోయి కెనడా లేదా ఈక్వెడార్‌లో తలదాచుకున్నాడని పోలీసులు భావిస్తున్నారు. అతను చివరిసారిగా న్యూజెర్సీలోని ఒక హోటల్ నుంచి నెవార్క్‌లోని రైలు స్టేషన్‌కు టాక్సీలో వెళ్లినట్లు తెలుస్తోంది. 2017లో పటేల్‌ను ఎఫ్‌బీఐ జాబితాలో చేర్చినప్పుడు అమెరికాలో ఉన్నట్లు భావించారు.

పటేల్ దేశం విడిచి వెళ్లేందుకు ఎవరో ఉద్దేశపూర్వకంగా సహాయం చేశారని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఏప్రిల్ 13, 2015న మేరీల్యాండ్ జిల్లా కోర్టు భద్రేష్ కుమార్‌పై అరెస్ట్ వారెంట్ జారీ చేసింది. పటేల్‌పై ఫస్ట్ డిగ్రీ మర్డర్, సెకండ్ డిగ్రీ మర్డర్ సహా పలు రకాల అభియోగాలు మోపింది. దీంతో 9 సంవత్సరాల తర్వాత కూడా అతను FBI టాప్ 10 మోస్ట్ వాంటెడ్ లిస్ట్‌లో ఉన్నాడు.


ఇది కూడా చదవండి:

PM Modi: కాంగ్రెస్‌పై మోదీ నిప్పులు.. ఎందుకంటే..?


సిద్ధాంత పోరులో ‘ఇండియా’దే విజయం


మరిన్ని అంతర్జాతీయ వార్తల కోసం

Updated Date - Apr 13 , 2024 | 10:22 AM