Share News

IPL 2024: నేడు PBKS vs SRH కీలక మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ABN , Publish Date - Apr 09 , 2024 | 09:02 AM

ఐపీఎల్ 2024 (IPL 2024) 17వ సీజన్‌లో ఈరోజు కీలకమైన 23వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య ముల్లన్‌పూర్‌(Mullanpur)లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. PBKS, SRH ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 2 గెలిచి పాయింట్ల పట్టికలో వరుసగా 5, 6వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నాయి.

IPL 2024: నేడు PBKS vs SRH కీలక మ్యాచ్..విన్ ప్రిడిక్షన్ ఎలా ఉందంటే

ఐపీఎల్ 2024 (IPL 2024) 17వ సీజన్‌లో ఈరోజు కీలకమైన 23వ మ్యాచ్ పంజాబ్ కింగ్స్(Punjab Kings), సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్ల మధ్య ముల్లన్‌పూర్‌(Mullanpur)లో రాత్రి 7.30 గంటలకు జరగనుంది. అయితే PBKS, SRH ఈ సీజన్‌లో ఇప్పటివరకు 4 మ్యాచ్‌లలో 2 గెలిచి పాయింట్ల పట్టికలో వరుసగా 5, 6వ స్థానాల్లో ఉన్నాయి. దీంతో ఇరు జట్లు కూడా ఈ మ్యాచ్ ఎలాగైనా గెలవాలని భావిస్తున్నాయి. మరోవైపు ముల్లన్‌పూర్ స్టేడియంలోని పిచ్ బ్యాట్స్‌మెన్‌లకు మంచిదని, ఫాస్ట్ బౌలర్లకు సహాయకరంగా ఉంటుందని క్రీడా నిపుణులు చెబుతున్నారు.


ఈ మైదానంలో ఆడిన గత 10 మ్యాచ్‌లను పరిశీలిస్తే ఇక్కడ కూడా ఫాస్ట్ బౌలర్లు తమ ఆధిపత్యాన్ని కొనసాగించారు. ఈ మైదానంలో ఇప్పటి వరకు ఒకే ఒక్క ఐపీఎల్ మ్యాచ్ జరిగింది. ఆ మ్యాచ్‌లో ఆతిథ్య పంజాబ్ కింగ్స్(PBKS) ఢిల్లీ క్యాపిటల్స్‌పై 175 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. ఈ క్రమంలో ఫాస్ట్ బౌలర్లు, మంచి బ్యాట్స్‌మెన్‌లను జట్టులో ఉంచడం ద్వారా గెలుపు అవకాశాలు సద్వినియోగం చేసుకోవచ్చని అంటున్నారు. ఇక గూగుల్ గెలుపు అంచనా ప్రకారం చూస్తే ఈ మ్యాచులో సన్‌రైజర్స్ హైదరాబాద్ జట్టు 54 శాతం గెలిచే అవకాశం ఉండగా, పంజాబ్ కింగ్స్ జట్టుకు 46 శాతం ఛాన్స్ ఉందని తెలిపింది.


ఇక వెదర్ రిపోర్ట్ ప్రకారం పంజాబ్‌లోని ముల్లన్‌పూర్‌(Mullanpur)లో వర్షం కురిసే అవకాశం లేదు. మ్యాచ్ ప్రారంభంలో ఉష్ణోగ్రత 32 డిగ్రీలు ఉంటుందని, మ్యాచ్ ముగిసే వరకు ఉష్ణోగ్రతలో తగ్గుదల కనిపించవచ్చని పేర్కొన్నారు.

పంజాబ్ కింగ్స్(Punjab Kings) జట్టులో శిఖర్ ధావన్ (C), జానీ బెయిర్‌స్టో, జితేష్ శర్మ (WK), ప్రభ్‌సిమ్రాన్ సింగ్, శామ్ కర్రాన్, శశాంక్ సింగ్, సికందర్ రజా, హర్‌ప్రీత్ బ్రార్, హర్షల్ పటేల్, కగిసో రబడ, అర్ష్‌దీప్ సింగ్ ఉన్నారు.

సన్‌రైజర్స్ హైదరాబాద్(Sunrisers Hyderabad) జట్టులో అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్, ఐడెన్ మర్క్రామ్, హెన్రిచ్ క్లాసెన్ (WK), అబ్దుల్ సమద్, షాబాజ్ అహ్మద్, పాట్ కమిన్స్ (C), జయదేవ్ ఉనద్కత్, భువనేశ్వర్ కుమార్, మయాంక్ మార్కండే, టీ నటరాజన్ కలరు.


ఇది కూడా చదవండి:

పట్టాలెక్కిన చెన్నై


Ravindra Jadeja: 1000 రన్స్, 100 క్యాచ్‌లు, 100 వికెట్లు.. ఐపీఎల్ చరిత్రలో జడేజా సరికొత్త రికార్డ్


మరిన్ని క్రీడా వార్తల కోసం

Updated Date - Apr 09 , 2024 | 09:15 AM