Share News

సుమిత్‌ సంచలనం

ABN , Publish Date - Apr 09 , 2024 | 01:22 AM

భారత టెన్నిస్‌ యువ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ సంచలన విజయం సాధించాడు. మాంటే కార్లో టోర్నమెంట్‌లో ప్రపంచ 38వ ర్యాంకర్‌ మాటె అర్నాల్డికి షాకిచ్చి వహ్‌వా అనిపించాడు...

సుమిత్‌ సంచలనం

మాంటే కార్లో: భారత టెన్నిస్‌ యువ ఆటగాడు సుమిత్‌ నగాల్‌ సంచలన విజయం సాధించాడు. మాంటే కార్లో టోర్నమెంట్‌లో ప్రపంచ 38వ ర్యాంకర్‌ మాటె అర్నాల్డికి షాకిచ్చి వహ్‌వా అనిపించాడు. సోమవారం జరిగిన పురుషుల సింగిల్స్‌ తొలి రౌండ్లో క్వాలిఫయర్‌, 93వ ర్యాంకరైన సుమిత్‌ 5-7, 6-2, 6-4తో అర్నాల్డి (ఇటలీ)ని వరుససెట్లలో చిత్తుచేశాడు. ఈ ప్రదర్శనతో 26 ఏళ్ల సుమిత్‌.. ఏటీపీ మాస్టర్స్‌ క్లే కోర్టు ఈవెంట్‌లో మెయిన్‌ డ్రాలో గెలుపు నమోదు చేసిన తొలి భారత ఆటగాడిగా రికార్డు సృష్టించాడు. టాప్‌-50లోపు ర్యాంకర్‌ను ఓడించడం నగాల్‌కు ఈ సీజన్‌లో ఇది మూడోసారి. రెండో రౌండ్లో ప్రపంచ ఏడో ర్యాంకర్‌ హోల్గర్‌ రూన్‌ (డెన్మార్క్‌)తో సుమిత్‌ అమీతుమీ తేల్చుకోనున్నాడు.

Updated Date - Apr 09 , 2024 | 01:22 AM