Share News

Hyderabad: భార్యను పంపడం లేదని మామ గొంతుకోసిన అల్లుడు..

ABN , Publish Date - May 25 , 2024 | 09:11 AM

భార్యను తన వద్దకు పంపటంలేదని కోపంతో అల్లుడు మామ గొంతుకోశాడు. ఈ ఘటన మధురానగర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhuranagar Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.

Hyderabad: భార్యను పంపడం లేదని మామ గొంతుకోసిన అల్లుడు..

హైదరాబాద్: భార్యను తన వద్దకు పంపటంలేదని కోపంతో అల్లుడు మామ గొంతుకోశాడు. ఈ ఘటన మధురానగర్‌ పోలీస్‏స్టేషన్‌(Madhuranagar Police Station) పరిధిలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. యాదగిరినగర్‌కు చెందిన రామారావు, సుబ్బలక్ష్మి దంపతుల కుమార్తె మాధవి భర్త చనిపోవటంతో పిల్లలతోపాటు పుట్టింట్లో ఉంటున్నది. అయితే, పాలకొల్లుకు చెందిన సుబ్రమణ్యం(Subramaniam)కు కూడా భార్య లేకపోవటంతో వీరిద్దరికి ఈ ఏడాది మార్చిలో వివాహం చేశారు. కాగా మాధవి పిల్లలు అమ్మమ్మ, తాతయ్యల వద్దనే ఉంటున్నారు. వివాహం అయిన తర్వాత మాధవి, సుబ్రమణ్యం మధ్య చిన్నచిన్న గొడవలు వస్తుండేవి.

ఇదికూడా చదవండి: Viral News: మహిళలు బట్టలు మార్చుకునే గదిలో సీసీటీవీ.. పోలీసుల కేసు నమోదు


వేసవి సెలవుల నేపథ్యంలో పుట్టింటికి వచ్చిన మాధవి పిల్లలను చూసుకుంటూ ఇక్కడే సేల్స్‌గర్ల్‌గా పనిచేస్తోంది. దీంతో భార్యను పంపాలని సుబ్రమణ్యం కోరుతూ వచ్చాడు. అయితే శుక్రవారం మాధవి విధులకు వెళ్లిన తర్వాత మద్యం తాగిన సుబ్రమణ్యం ఇంటికి వచ్చి మామ రామారావుతో తన భార్యను తనతో పంపాలని కోరాడు. వేసవి సెలవులు అయ్యే వరకు పంపటం కుదరదని అత్తమామలు సుబ్బలక్ష్మి, రామారావులు తెలిపారు. దీంతో కోపంతో సుబ్రమణ్యం మామ రామారావుపై దాడి చేసి బ్లేడుతో గొంతు కోశాడు. తీవ్రంగా గాయపడిన రామారావును ఆస్పత్రికి తరలించారు. తన తండ్రిపై భర్త హత్యాయత్నం చేశాడని మాధవి మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.



ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు

ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 25 , 2024 | 09:11 AM