Share News

Viral News: మహిళలు బట్టలు మార్చుకునే గదిలో సీసీటీవీ.. పోలీసుల కేసు నమోదు

ABN , Publish Date - May 24 , 2024 | 07:06 PM

భక్తులు పవిత్రంగా భావించే గంగనహర్ ఛోటా హరిద్వార్‌(Chhota Haridwar)లో పలువురు దుండగులు అభ్యంతరకర పనులకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఛోటా హరిద్వార్‌లో స్నానం చేసేందుకు వచ్చిన మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో సీసీటీవీ కెమెరాను అమర్చారు. అది గమనించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Viral News: మహిళలు బట్టలు మార్చుకునే గదిలో సీసీటీవీ.. పోలీసుల కేసు నమోదు
CCTV Gangahar Chota Haridwar

భక్తులు పవిత్రంగా భావించే గంగనహర్ ఛోటా హరిద్వార్‌(Chhota Haridwar)లో పలువురు దుండగులు అభ్యంతరకర పనులకు సిద్ధమయ్యారు. ఆ క్రమంలో ఛోటా హరిద్వార్‌లో స్నానం చేసేందుకు వచ్చిన మహిళలు దుస్తులు మార్చుకునే గదిలో సీసీటీవీ కెమెరాను అమర్చారు. అది గమనించిన ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో అప్రమత్తమైన పోలీసులు విచారణ చేపట్టారు.

విచారణలో భాగంగా దర్యాప్తు చేయగా పలువురు మహిళలు దుస్తులు మార్చుకుంటున్న వీడియోలు సీసీటీవీలో లభ్యమయ్యాయి. ఆ క్రమంలో ఐదు రోజుల రికార్డింగ్ దొరికినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాదు చాలా కాలంగా మహిళలపై ఆ ప్రాంతంలో అభ్యంతరకర వీడియోలు తీస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసిన పోలీసులు(police) పలువురిని విచారిస్తున్నారు.


ఇంతకు ముందు కూడా ఇలాంటిదే ఉదంతం వెలుగులోకి వచ్చింది. గంగానహర్‌(Gangahar)లోని శని మందిర్ కాంప్లెక్స్‌లో మహిళలు స్నానం చేస్తుండగా.. ముగ్గురు యువకులపై మహిళలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ ముగ్గురు వ్యక్తులు రహస్యంగా మహిళల వీడియోలు తీస్తున్నారనేది ఆరోపణ. గంగానగర్‌లో మహిళల కోసం ప్రత్యేక ఘాట్‌ను ఇప్పటికే నిర్మించారు. ఆ క్రమంలో ఆ యువకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.


మరోవైపు ఇటివల ఇండోర్‌లో ఓ షోరూంలో ఓ అమ్మాయి(girl) రహస్య అసభ్యకర వీడియో తీసిన ఉదంతం వెలుగులోకి వచ్చింది. ఈ కేసులో నిందితుడైన మేనేజర్‌ని పోలీసులు అరెస్టు చేశారు. మేనేజరు దుస్తులు మార్చుకునే గది తలుపు కింద మొబైల్ ద్వారా వీడియోలు తీసేవాడు. ఓ అమ్మాయి తన స్నేహితుడితో కలిసి షాపింగ్‌కు వెళ్లింది. ఆ క్రమంలో జీన్స్ వేసుకోవడానికి ఆమె బట్టలు మార్చుకునే గదికి వెళ్ళగా, ఆమె పాదం ఫోన్ పెట్టిన మేనేజర్ చేతికి తగిలింది. దీంతో బాలిక కేకలు వేయడంతో నిందితుడు అక్కడి నుంచి పారిపోయాడు. అనంతరం ఫిర్యాదు అందుకున్న పోలీసులు నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు.


ఇది కూడా చదవండి:

Credit Card: క్రెడిట్ కార్డు వాడుతున్నారా..ఈ మోసాల పట్ల జాగ్రత్త

అమ్మకానికి చిన్నారి.. ఆర్‌ఎంపీ డాక్టర్‌ అరెస్ట్‌


Read Latest Crime News and Telugu News

Updated Date - May 24 , 2024 | 07:09 PM