Share News

Chennai: తల్లిని తిట్టాడని తండ్రిని హతమార్చిన కొడుకు...

ABN , Publish Date - May 22 , 2024 | 01:09 PM

తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపం తిరుమళిసై వద్ద తల్లిని తిట్టాడనే ఆగ్రహంతో తండ్రిని హతమార్చిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తిరుమళిసై(Tirumalisai) ప్రాంతంలో బాబు అనే వడ్రంగి భార్య దేవి, కుమారుడు తమిళరసన్‌ నివసిస్తున్నారు.

Chennai: తల్లిని తిట్టాడని తండ్రిని హతమార్చిన కొడుకు...

చెన్నై: తిరువళ్లూరు జిల్లా పూందమల్లి సమీపం తిరుమళిసై వద్ద తల్లిని తిట్టాడనే ఆగ్రహంతో తండ్రిని హతమార్చిన సంఘటన తీవ్ర కలకలం సృష్టించింది. తిరుమళిసై(Tirumalisai) ప్రాంతంలో బాబు అనే వడ్రంగి భార్య దేవి, కుమారుడు తమిళరసన్‌ నివసిస్తున్నారు. బాబుకు తాగుడు అలవాటు ఉంది. రోజూ తాగి ఇంటికి వచ్చి భార్యతో గొడవపడుతుండేవాడు. సోమవారం రాత్రి కూడా బాబు తాగి ఇంటికి వెళ్ళి భార్య దేవితో గొడవపడ్డాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: నల్లటి దుస్తులు.. ముఖాలకు మాస్కులతో.. విషయం ఏంటంటే..


ఆ సందర్భంగా దేవిని నానాదుర్భాషలాడారు. ఆ సమయంలో అక్కడే ఉన్న తమిళరసన్‌(Tamilarasan) తండ్రిపై ఆగ్రహించి చితకబాది నెట్టాడు. దీంతో నేలపై పడిన బాబు తీవ్రంగా గాయపడి ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషయం తెలుసుకున్న వెల్లవేడు పోలీసులు వెళ్లి బాబు మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని పోస్టుమార్టంకు పంపారు.


ఇదికూడా చదవండి: Hyderabad: బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు...


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 01:09 PM