Share News

Hyderabad: బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు...

ABN , Publish Date - May 21 , 2024 | 10:10 AM

తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌(Phone tapping) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు బంజారాహిల్స్‌ పోలీస్‏స్టేషన్‌(Banjara Hills Police Station) పరిధిలో కొనసాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసు విచారణ ఇక నుంచి జూబ్లీహిల్స్‌ పోలీస్‏స్టేషన్‌(Jubilee Hills Police Station)లో జరగనుంది.

Hyderabad: బంజారాహిల్స్‌ నుంచి జూబ్లీహిల్స్‌ పీఎస్‌కు...

- ఫోన్‌ట్యాపింగ్‌ కేసు విచారణ బదిలీ

హైదరాబాద్‌ సిటీ: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన ఫోన్‌ ట్యాపింగ్‌(Phone tapping) వ్యవహారంలో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఇప్పటి వరకు బంజారాహిల్స్‌ పోలీస్‏స్టేషన్‌(Banjara Hills Police Station) పరిధిలో కొనసాగిన ఫోన్‌ట్యాపింగ్‌ కేసు విచారణ ఇక నుంచి జూబ్లీహిల్స్‌ పోలీస్‏స్టేషన్‌(Jubilee Hills Police Station)లో జరగనుంది. ఈ కేసులో దర్యాప్తు అధికారిగా జూబ్లీహిల్స్‌ ఏసీపీ వి.వెంకటగిరి కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే పోలీస్‏స్టేషన్‌ మార్పునకు అధికారులు స్పష్టమైన కారణాలు చెప్పనప్పటికీ ఇప్పటికే కేసు విచారణ ఓ కొలిక్కి రావడంతో మిగిలిన దర్యాప్తు వ్యవహారాలన్నీ జూబ్లీహిల్స్‌లోని తన కార్యాలయం నుంచే చూసుకునే విధంగా ఏసీపీ కోరినట్లు తెలిసింది.

ఇదికూడా చదవండి: ఐదు రోజుల్లో నాలుగు చోరీలు.. నగరంలో దోపిడీ దొంగలు


అంతేకాకుండా విచారణలో భాగంగా తరచూ జూబ్లీహిల్స్‌ నుంచి బంజారాహిల్స్‌కు వెళ్లి రావడంతో పాలనాపరమైన ఇబ్బందులు సైతం ఎదుర్కోవాల్సి వస్తోంది. ఈ నేపథ్యంలోనే జూబ్లీహిల్స్‌కు మార్చినట్లు తెలుస్తోంది. ఇటీవల పార్లమెంట్‌ ఎన్నికలు ముగిసిన నేపథ్యంలో ఇకపై ఈ కేసులో అధికారులు దూకుడు పెంచనున్నట్లు తెలిసింది. త్వరలోనే మరికొంతమందిని అదుపులోకి తీసుకొని విచారించనున్నట్లు సమాచారం.


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 21 , 2024 | 10:10 AM