Share News

Hyderabad: ఈఎంఐలో ట్యాబ్‌లు ఇప్పిస్తానని..

ABN , Publish Date - May 22 , 2024 | 10:51 AM

ఈఎంఐలో తక్కువకు ట్యాబ్‌లు ఇప్పిస్తానని క్రెడిట్‌కార్డు(Credit card) వివరాలు తీసుకుని ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. మధురానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లారెడ్డిగూడ(Ellareddyguda) పడాల రామిరెడ్డి కాలేజీ సమీపంలో నివాసముండే బోయల్ల ఆంజనేయులు కోకోనట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి 28-3-2024లో వెంకట్‌ బండారి అలియాస్‌ వెంకటేష్‌ అనే వ్యక్తి వాట్సాప్(Whatsapp)‏లో మెసేజ్‌ పెట్టాడు.

Hyderabad: ఈఎంఐలో ట్యాబ్‌లు ఇప్పిస్తానని..

హైదరాబాద్: ఈఎంఐలో తక్కువకు ట్యాబ్‌లు ఇప్పిస్తానని క్రెడిట్‌కార్డు(Credit card) వివరాలు తీసుకుని ఓ వ్యక్తి మోసానికి పాల్పడ్డాడు. మధురానగర్‌ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఎల్లారెడ్డిగూడ(Ellareddyguda) పడాల రామిరెడ్డి కాలేజీ సమీపంలో నివాసముండే బోయల్ల ఆంజనేయులు కోకోనట్‌ వ్యాపారం చేస్తుంటాడు. ఇతడికి 28-3-2024లో వెంకట్‌ బండారి అలియాస్‌ వెంకటేష్‌ అనే వ్యక్తి వాట్సాప్(Whatsapp)‏లో మెసేజ్‌ పెట్టాడు. తరువాత ఫోన్‌ చేసి బైజూస్‌ ఏజెంట్‌నని, తక్కువ ధరకు ట్యాబ్‌లు ఈఎంఐలో ఇప్పిస్తానని చెప్పాడు. ఆంజనేయులు ఆసక్తి చూపడంతో అదే రోజు వచ్చి అతడి వద్ద ఆధార్‌కార్డు, పాన్‌కార్డుతో పాటు ఐసీఐసీఐ క్రెడిట్‌కార్డు(ICICI Credit Card) వివరాలు తీసుకొని వెళ్లాడు.

ఇదికూడా చదవండి: Hyderabad: జైలుకు వెళ్లొచ్చినా చోరీలు మానలేదుగా...


కొద్దిరోజుల తరువాత అతని క్రెడిట్‌ కార్డు నుంచి రూ. 66,111 బైజూస్‏కి క్రెడిట్‌ అయినట్టు మెసేజ్‌ వచ్చింది. వెంటనే వెంకటేష్‏కు ఫోన్‌ చేయగా స్పంధించలేదు. దీంతో బంజారాహిల్స్‌లోని బైజూస్‌ కార్యాలయానికి వెళ్తే ఆ కార్యాలయం చాలా కాలం క్రితం మూసివేశారని తెలిసింది. దీంతో ఎన్‌సీఆర్‌ పోర్టల్‌లో ఫిర్యాదు చేశాడు. స్థానిక పోలీస్‌ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలనే విషయంపై అవగాహన లేకపోవడతో ఆలస్యంగా మధురానగర్‌ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు దర్యాప్తు చేస్తున్నారు.

ఇదికూడా చదవండి: Hyderabad: మీపై ఫెమా కేసు.. అరెస్ట్‌ తప్పదంటూ బెదిరింపులు


ఇదికూడా చదవండి: Hyderabad: పోలింగ్‌ రోజున.. తగ్గిన పొల్యూషన్‌

Read Latest Telangana News and National News

Read Latest AP News and Telugu News

Updated Date - May 22 , 2024 | 10:51 AM