Share News

IPO Finance: ఐపీవోలలో పెట్టుబడి కోసం లోన్స్ ఇస్తున్న బ్యాంకులు, సంస్థలివే

ABN , Publish Date - May 02 , 2024 | 01:54 PM

అనేక మంది పెట్టుబడిదారులు IPOలో పెట్టుబడి పెట్టాలని ఆసక్తితో ఉంటారు. కానీ వారి దగ్గర సమయానికి సరైన మొత్తంలో డబ్బు ఉండదు. దీంతో ఆయా IPOలను తీసుకోకుండానే ఉండిపోతారు. కానీ IPOలో పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా బ్యాంకులు(banks) లేదా పైనాన్స్ సంస్థల(financial institutions) నుంచి రుణం తీసుకుని ఇన్‌వెస్ట్ చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

IPO Finance: ఐపీవోలలో పెట్టుబడి కోసం లోన్స్ ఇస్తున్న బ్యాంకులు, సంస్థలివే
It is banks and institutions that give loans to invest in IPOs

అనేక మంది పెట్టుబడిదారులు IPOలో పెట్టుబడి పెట్టాలని ఆసక్తితో ఉంటారు. కానీ వారి దగ్గర సమయానికి సరైన మొత్తంలో డబ్బు ఉండదు. దీంతో ఆయా IPOలను తీసుకోకుండానే ఉండిపోతారు. కానీ IPOలో పెట్టుబడి పెట్టడానికి మీ దగ్గర డబ్బులు లేకున్నా కూడా బ్యాంకులు(banks) లేదా పైనాన్స్ సంస్థల(financial institutions) నుంచి రుణం తీసుకుని ఇన్‌వెస్ట్ చేయవచ్చని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు అటువంటి రుణాన్ని(loans) పొందగలరా లేదా అనేది మీ క్రెడిట్ సామర్థ్యం, ఆర్థిక సంస్థ రుణ విధానం, లోన్ నిబంధనలు, షరతులు వంటి అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది.


కొన్ని బ్యాంకులు, ఆర్థిక సంస్థలు IPOలో పెట్టుబడి కోసం రుణాలు ఇస్తున్నాయి. వాటిలో SBI (స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా), బ్యాంక్ ఆఫ్ బరోడా, ఆదిత్య బిర్లా ఫైనాన్స్, బజాజ్ ఫిన్‪‌సర్వ్ వంటి పలు సంస్థలు ఈ రకమైన రుణాలను అందిస్తున్నాయి. అయితే లోన్ మొత్తం, చెల్లించాల్సిన వ్యవధిని బట్టి రుణాల చెల్లింపు ఉంటుంది. అంతేకాదు ఈ లోన్స్ విషయంలో వడ్డీ రేటు కూడా కొంచెం ఎక్కువగానే ఉంటుంది. వీటిని పరిగణలోకి తీసుకుని లోన్స్ తీసుకోవాలి.


ప్రైవేట్ కంపెనీలు IPO ద్వారా ప్రజలకు షేర్లను అందిస్తాయి. కంపెనీ ప్రయాణంలో ఇది చాలా ముఖ్యమైన సంఘటన. ఎందుకంటే దీని ద్వారా కంపెనీ స్టాక్ మార్కెట్‌లోకి ప్రవేశిస్తుంది. భారతదేశంలో IPOలో పెట్టుబడి పెట్టడం ద్వారా, పెట్టుబడిదారులు లాభాలను సంపాదించవచ్చు. కొత్త పెట్టుబడి అవకాశాల ప్రయోజనాన్ని పొందవచ్చు. ఏదేమైనప్పటికీ ఏదైనా IPOలో పెట్టుబడి పెట్టే ముందు, దాని గురించి సరైన పరిశోధన చేసిన తర్వాత మాత్రమే పెట్టుబడి చేయాలనేది చాలా ముఖ్యమని గుర్తుంచుకోవాలి.


ఇది కూడా చదవండి:

Amazon Great Summer Sale 2024: నేటి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ

IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్‌ ప్రయాణం


Read Latest Business News and Telugu News

Updated Date - May 02 , 2024 | 01:57 PM