Share News

Amazon Great Summer Sale 2024: నేటి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ

ABN , Publish Date - May 02 , 2024 | 11:42 AM

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024(Amazon Great Summer Sale 2024) ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. మే 2, 2024న మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ సేల్ కాసేపట్లో అందరికీ అందుబాటులోకి రానుంది.

 Amazon Great Summer Sale 2024: నేటి నుంచే అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ షురూ
Amazon Great Summer Sale 2024 starts may 2nd 2024

అమెజాన్ గ్రేట్ సమ్మర్ సేల్ 2024(Amazon Great Summer Sale 2024) ఇప్పుడు మళ్లీ వచ్చేసింది. మే 2, 2024న మధ్యాహ్నం 12 గంటలకు మొదలు కానున్న ఈ సేల్ కాసేపట్లో అందరికీ అందుబాటులోకి రానుంది. ఈ సేల్‌లో, స్మార్ట్‌ఫోన్‌లు, ACలు, వంటగది ఉపకరణాలు, ల్యాప్‌టాప్‌లు, స్మార్ట్‌వాచ్‌లు, ఇయర్‌ఫోన్‌లతో సహా అమెజాన్ ప్లాట్‌ఫారమ్‌లో వివిధ వర్గాల అనేక ఉత్పత్తులపై వినియోగదారులకు భారీ తగ్గింపు ఆఫర్‌లను ప్రకటించారు. అమెజాన్ ప్రైమ్‌ సభ్యులకు(prime members) ఈ సేల్ అర్ధరాత్రి 12 గంటల నుంచే ప్రారంభమైంది. అయితే ఈ అమెజాన్ సేల్‌లో అందుబాటులో ఉన్న కొన్ని బెస్ట్ డీల్స్ గురించి ఇప్పుడు చుద్దాం.


ఐఫోన్ 13

అమెజాన్ సేల్‌లో ఐఫోన్ 13 ధర రూ.59,900 ఉండగా, రూ.48,999కి లభిస్తుంది. ఈ ఫోన్‌లో 6.1 అంగుళాల సూపర్ రెటినా XDR డిస్‌ప్లే, 12MP + 12MP వైడ్ యాంగిల్, అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, వీడియో రికార్డింగ్ కోసం సినిమాటిక్ మోడ్ వంటి అధునాతన ఫీచర్లు ఉన్నాయి. దీంతోపాటు శక్తివంతమైన A15 బయోనిక్ చిప్ ప్రాసెసర్ కూడా ఉంది.

Samsung Galaxy M15

ఈ ఫోన్ ధర అసలు ధర రూ. 15,999 కాగా అమెజాన్ సేల్‌లో దీన్ని రూ. 11,999తో లభిస్తుంది. ఈ ఫోన్‌లో 6.5 అంగుళాల సూపర్ AMOLED డిస్‌ప్లే, 50MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్, MediaTek Dimensity 6100+ చిప్‌సెట్, 6000mAh బ్యాటరీ, 4 సంవత్సరాల Android OS అప్‌గ్రేడ్‌లు, 5 ఏళ్ల వరకు సెక్యూరిటీ అప్‌డేట్‌లు లభిస్తాయి.


వివోబుక్ 15

మీరు గొప్ప గేమింగ్ ల్యాప్‌టాప్‌ను కొనుగోలు చేయాలనుకుంటే Asus Vivobook 15 మంచి ఎంపిక అని చెప్పవచ్చు. ఈ ల్యాప్‌టాప్ ధర రూ. 80,990 అయితే ఈ సేల్‌లో దీన్ని అనేక ఇతర డిస్కౌంట్లు, ఆఫర్‌లతో కలిపి రూ.57,990కి అందిస్తున్నారు. ఈ ల్యాప్‌టాప్‌లో ఇంటెల్ కోర్ i5-12500H చిప్‌సెట్, 16GB DDR4 ర్యామ్, 512GB NVMe PCIe SSD, 15.6 అంగుళాల ఫుల్ HD డిస్ప్లే, ప్రీ లోడెడ్ విండో 11 సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.


Redmi స్మార్ట్ LED TV

ఈ స్మార్ట్ టీవీ పరిమాణం 32 అంగుళాలు. ఇది HD రెడీ స్మార్ట్ LED టీవీ, ఈ టీవీ అసలు ధర రూ. 24,999, కానీ అమెజాన్ సేల్‌లో దీనిని రూ. 11,999 మాత్రమే కొనుగోలు చేయవచ్చు. ఈ టీవీలో డ్యూయల్ బ్యాండ్ వై-ఫై, ఫైర్ టీవీ సపోర్ట్‌లు, 12000 కంటే ఎక్కువ యాప్‌లు, అలెక్స్‌తో వాయిస్ కంట్రోల్ సపోర్ట్ వంటి అనేక ప్రత్యేక ఫీచర్లు ఉన్నాయి.

ఏసీలపై తగ్గింపు

Amazon ఈ సేల్‌లో అనేక ACలపై డిస్కౌంట్లు కూడా ఇస్తుంది. LG 1.5 టన్ను 3 స్టార్ స్ప్లిట్ AC ధర తగ్గింపుతో రూ. 37,490, డైకిన్ 1.5 టన్ 3 స్టార్ స్ప్లిట్ AC ధర రూ. 36,990కు అందుబాటులో ఉంది.


ఇది కూడా చదవండి:

IRCTC: తక్కువ బడ్జెట్‌లోనే.. షిర్డీ, శని శింగనాపూర్‌ ప్రయాణం


Abhibus : ఓటర్ల కోసం అభిబస్‌ ప్రత్యేక ఆఫర్‌


Read Latest Business News and Telugu News

Updated Date - May 02 , 2024 | 11:46 AM