Share News

Business Idea: ఏ సీజన్‌లోనైనా చేసుకునే బిజినెస్.. పరిమిత పెట్టుబడితో రెండింతల లాభం

ABN , Publish Date - May 24 , 2024 | 03:20 PM

మీరు ఎప్పటి నుంచో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని చుస్తు్న్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే అన్ని సీజన్లలో చేసుకునే మంచి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారాన్ని పరిమిత మొత్తంతో ప్రారంభించవచ్చు. ప్రస్తుతం దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ బట్టల బిజినెస్.

Business Idea: ఏ సీజన్‌లోనైనా చేసుకునే బిజినెస్.. పరిమిత పెట్టుబడితో రెండింతల లాభం
clothes business

మీరు ఎప్పటి నుంచో సొంత వ్యాపారాన్ని ప్రారంభించాలని చుస్తు్న్నారా. అయితే మీకు గుడ్ న్యూస్. ఎందుకంటే అన్ని సీజన్లలో చేసుకునే మంచి బిజినెస్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ఈ వ్యాపారాన్ని పరిమిత మొత్తంతో ప్రారంభించవచ్చు. అదే బట్టల వ్యాపారం(clothes business). ఈ బిజినెస్ ప్రతి ఏడాది అనేక నగరాల్లో వేగంగా అభివృద్ధి చెందుతోంది. అంతేకాదు ఇది 2019-20లో సుమారు 10 శాతం CAGR వృద్ధిని చూపించింది. ఇక 2025-26 నాటికి 190 బిలియన్ డాలర్లకు చేరుకుంటుందని అంచనా వేశారు. దీంతోపాటు ఇది భారతదేశ జీడీపీకి దాదాపు 5 శాతం సహకరిస్తుంది.


ప్రస్తుతం దేశంలో వ్యవసాయం తర్వాత అత్యధిక మందికి ఉపాధి కల్పిస్తున్న పరిశ్రమ బట్టల బిజినెస్. దీనివల్ల దాదాపు 4.5 కోట్ల మందికి ప్రత్యక్షంగా, దాదాపు 10 కోట్ల మంది పరోక్షంగానూ ఉపాధి పొందుతున్నారు. దేశంలో ఏ పండుగ జరిగినా లేదా పెళ్లిళ్ల వంటి శుభకార్యాలకు ఎక్కువగా కొత్త బట్టలు కొనుగోలు చేసేందుకు ప్రజలు ఆసక్తి చూపుతారు. దీంతో ఈ వ్యాపారానికి దేశంలో ఎక్కువ డిమాండ్(demand) ఏర్పడింది. ఇలాంటి పరిస్థితుల్లో మీరు రెడీమేడ్ గార్మెంట్స్ వ్యాపారాన్ని ప్రారంభించవచ్చు.


అయితే రెడీమేడ్ బట్టల వ్యాపారాన్ని ఎలా ప్రారంభించాలి? ఈ వ్యాపారాన్ని ప్రారంభించే ముందు ఏం చేయాలనేది ఇప్పుడు చుద్దాం. బట్టల వ్యాపారాన్ని ప్రారంభించే ముందు మీరు స్థానిక మార్కెట్ గురించి పరిశోధన చేయాలి. ఆ తర్వాత మీరు పెట్టాలనుకున్న ప్రాంతంలో ఓ షాపును అద్దెకు తీసుకోవాలి. ప్రారంభంలో చిన్న దుకాణంతో ప్రారంభించవచ్చు. దీంతోపాటు మీరు దుకాణంలో ఇద్దరు విక్రయదారులను నియమించుకుని, ప్రజల కొనుగోలు స్థాయిని బట్టి ఎంత బడ్జెట్‌ పెట్టాలనేది నిర్ణయించుకోవాలి. దీంతోపాటు ఎవరి బట్టలు విక్రయించాలనుకుంటున్నారో నిర్ణయించుకుని, పురుషులు, మహిళలు లేదా పిల్లలు ఇలా పలు రకాల దుస్తువులను సేకరించి సేల్(sale) చేసుకోవచ్చు.


దీని కోసం రెడీమేడ్ బట్టలను(readymade clothes) హోల్ సేల్ విధానంలో కొనుగోలు చేసి మీరు అమ్మాలనుకున్న ప్రాంతంలో సేల్ చేయాల్సి ఉంటుంది. ఢిల్లీలోని గాంధీ బజార్ లేదా గుజరాత్‌లోని సూరత్ లేదా మహారాష్ట్రలోని ముంబయి నుంచి బట్టలను తక్కువ ధరలకు తెచ్చుకోవచ్చు. ఈ ప్రాంతాల్లో బట్టలు చౌకగా ఉన్నందున మీరు వాటిపై భారీ లాభాలను సంపాదించవచ్చు. ఈ వ్యాపారానికి మార్కెట్‌లో ఎప్పుడూ ఉంటుంది. మాంద్యం సమయంలో కూడా ప్రజలు బట్టలు కొనడం మానరు. ఈ నేపథ్యంలో ఈ వ్యాపారాన్ని 2 లక్షల రూపాయలతో ప్రారంభించి ప్రతి ఏడాది రెండింతల లాభం పొందవచ్చు.


ఇది కూడా చదవండి:

Bank Holidays: జూన్ 2024లో బ్యాంకు సెలవులు ఎన్ని రోజులో తెలుసా..ఈసారి ఏకంగా.

Mileage Tips: పెట్రోల్, డీజిల్ ఎంత పోయించుకుంటే బెటర్.. ఫుల్ ట్యాంక్ లేదా లీటర్

Read Latest Business News and Telugu News

Updated Date - May 24 , 2024 | 03:22 PM