Share News

Google: ఈ ఏడాదీ కోత తప్పదు.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..

ABN , Publish Date - Jan 18 , 2024 | 01:46 PM

గూగుల్ లో ఉద్యోగుల తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఎంప్లాయిస్ ను తొలగించిన యాజమాన్యం..

Google: ఈ ఏడాదీ కోత తప్పదు.. ఉద్యోగులకు గూగుల్ వార్నింగ్..

గూగుల్ లో ఉద్యోగుల తీసివేతల పర్వం కొనసాగుతోంది. ఇప్పటికే వివిధ విభాగాల్లో వెయ్యి మందికి పైగా ఎంప్లాయిస్ ను తొలగించిన యాజమాన్యం.. ఈ ఏడాది మరోసారి కోత తప్పదని ఎంప్లాయిస్ కు తెలిపింది. పెట్టుబడుల కోసం ప్రతిష్టాత్మకమైన లక్ష్యాలు, ప్రణాళికలు ఉన్నాయని వీటి నిర్వహణ కోసం ఉద్యోగాల కోతలు తప్పవని గూగుల్ సీఈఓ సుందర్ పిచాయ్ వెల్లడించారు. గతంలో ఉన్న నియమాలు ఈ ఏడాది ఉండకపోవచ్చని తెలిపారు. గూగుల్ యాజమాన్యంలోని యూట్యూబ్ నుంచి కనీసం 100 మందిని తొలగిస్తున్నట్లు వెల్లడించింది. ఇందుకు సంబంధించిన వివరాలను యూట్యూబ్ చీఫ్ బిజినెస్ ఆఫీసర్ మేరీ ఎలెన్ కో ప్రకటించారు.

కాగా.. గూగుల్‌ గతంలో చాలా మంది ఉద్యోగులను తొలగించింది. ఆ సంఖ్య ఎంత అనేది మాత్రం వెల్లడించలేదు. హార్డ్‌వేర్‌, వాయిస్‌ అసిస్టెన్స్‌, ఇంజనీరింగ్‌ టీమ్స్‌లో ఈ తీసివేతలు ఎక్కువగా ఉన్నట్టు సమాచారం. ఖర్చుల తగ్గింపులో భాగంగా ఈ చర్య తీసుకున్నట్టు తెలిపింది.

Updated Date - Jan 18 , 2024 | 01:46 PM