Share News

Best Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంక్స్ ఇవే..!

ABN , Publish Date - Feb 23 , 2024 | 08:28 AM

Best Home Loans: గత ఏడాది కాలంగా దేశంలో రెపో రేటు(Repo Rate)లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2023లో రెపో రేటును 0.25 శాతం పెంచారు. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గృహ రుణ(Home Loans) వడ్డీ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు.

Best Home Loans: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? తక్కువ వడ్డీ రేటు ఇచ్చే బ్యాంక్స్ ఇవే..!
Home Loan Interest Rates

Best Home Loans: గత ఏడాది కాలంగా దేశంలో రెపో రేటు(Repo Rate)లో ఎలాంటి మార్పు లేదు. ఫిబ్రవరి 2023లో రెపో రేటును 0.25 శాతం పెంచారు. దీంతో రెపో రేటు ప్రస్తుతం 6.50 శాతంగా ఉంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎలాంటి మార్పు చోటు చేసుకోలేదు. గృహ రుణ(Home Loans) వడ్డీ రేట్లు కూడా పెద్దగా పెరగలేదు.

ఇదిలాఉంటే.. చాలా మంది తమ సొంతింటి కలను నిజం చేసుకోవడానికి అనేక మార్గాలను అన్వేషిస్తారు. అందులో ప్రధానమైంది హోమ్ లోన్. బ్యాంకుల(Banks) నుంచి హోమ్ లోన్ తీసుకుని.. ఇల్లు కట్టుకోవడం గానీ, కొనడం గానీ చేస్తుంటారు. అయితే, హోమ్ లోన్ తీసుకునే ముందు రుణగ్రహీతలు వివిధ బ్యాంకులు హోమ్ లోన్‌పై వేసే వడ్డీ రేట్లను పోల్చి చూస్తారు. చాలా బ్యాంకులు సాధారణంగా 9-11% వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ ఇస్తాయి. అయితే, ఈ వడ్డీ రేటు క్రెడిట్ స్కోర్, రుణం మొత్తం మీద కూడా ఆధారపడి ఉంటుంది. దేశంలోని ప్రధాన బ్యాంకులు హోమ్ లోన్స్‌పై ఎంత వడ్డీ వసూలు చేస్తున్నాయో ఓసారి తెలుసుకుందాం..

హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ వడ్డీ రేట్స్..

హెచ్‌డీఎఫ్‌సీ(HDFC)బ్యాంక్ ఉద్యోగులకు, బిజినెస్ చేసే రుణగ్రహీతలకు 8.55 శాతం నుండి 9.10 శాతం వరకు వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తోంది.

ఐసీఐసీఐ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్స్..

ఐసీఐసీఐ (ICICI) బ్యాంక్ 800 క్రెడిట్ స్కోర్‌ ఉండే రుణగ్రహీతలకు 9 శాతం వడ్డీ రేటుతో లోన్స్ ఇస్తోంది. 750-800 మధ్య క్రెడిట్ స్కోర్‌లు ఉన్న వ్యక్తులకు 9.10 శాతం (స్వయం ఉపాధి పొందేవారికి), 9 శాతం (ఉద్యోగులకు) వడ్డీ రేట్లు అందిస్తోంది. ఈ వడ్డీ రేట్లు ఫిబ్రవరి 29, 2024 వరకు చెల్లుబాటులో ఉంటాయి. ప్రామాణిక హోమ్ లోన్ వడ్డీ రేట్లు లోన్ మొత్తాన్ని బట్టి 9.25% నుండి 9.90%(ఉద్యోగులు), బిజినెస్ చేసే వ్యక్తులకు 9.40% నుండి 10.05% వరకు ఉంటాయి.

కోటక్ మహీంద్రా బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు..

కోటక్ మహీంద్రా బ్యాంక్ 9 శాతం కంటే తక్కువ వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ అందిస్తోంది. ఉద్యోగులకు(నెలవారీ జీతం పొందేవారు) గృహ రుణాలపై 8.70 శాతం వడ్డీ రేటు ఉంది. మరోవైపు స్వయం ఉపాధి పొందుతున్న వారి నుంచి గృహ రుణాలపై 8.75 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారు.

బ్యాంక్ ఆఫ్ బరోడా హోమ్ లోన్ వడ్డీ రేటు..

ఈ బ్యాంకు 8.40 శాతం నుండి 10.60 శాతం మధ్య వడ్డీ రేటుతో హోమ్ లోన్స్ ఇస్తోంది. ఇవి ప్రస్తుతం ఫ్లెక్సిబుల్ రేట్లు. ఉద్యోగులకు అందించే స్థిర వడ్డీ రేటు 10.15 నుండి 11.50 శాతం మధ్య ఉంటుంది. స్వయం ఉపాధి పొందే వారికి 10.25 నుండి 11.60 శాతం వరకు వడ్డీని అందిస్తారు.

పంజాబ్ నేషనల్ బ్యాంక్ హోమ్ లోన్ వడ్డీ రేట్లు..

ఈ బ్యాంకు రుణ గ్రహీతలకు రుణ మొత్తం, క్రెడిట్ స్కోర్, LTV నిష్పత్తి ఆధారంగా 9.40 శాతం నుండి 11.10 శాతం మధ్య రేట్ల వద్ద గృహ రుణాలను అందిస్తోంది. LTV 80 శాతం కంటే తక్కువగా లేదా సమానంగా ఉన్నప్పుడు, క్రెడిట్ స్కోర్ 800 కంటే ఎక్కువ ఉన్నప్పుడు.. 10 సంవత్సరాల వరకు గృహ రుణాలకు వడ్డీ 9.40 శాతం, ఎక్కువ కాల వ్యవధిలో ఇది 9.90 శాతం అందిస్తోంది. LTV రేషియో పెరగడం, క్రెడిట్ స్కోర్ తగ్గితే వడ్డీ రేటు కూడా పెరుగుతుంది.

మరిన్ని బిజినెస్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి..

Updated Date - Feb 23 , 2024 | 08:51 AM