Share News

Aadhaar Card: ఫ్రీగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకున్నారా.. లేదంటే మీకే నష్టం

ABN , Publish Date - Apr 22 , 2024 | 01:37 PM

ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డ్(Aadhaar card) అత్యంత కీలక కార్డుగా మారిపోయింది. ఆధార్ కార్డ్ లేకుండా పలు రకాల స్కీమ్స్ సహా అనేక పనులు కూడా నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డును తప్పులు లేకుండా మార్చుకోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని చెప్పవచ్చు. ఇందుకోసం యూఐడీఏఐ ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే మీరు ఇంకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే వెంటనే ఉపయోగించుకోండి. అది ఎలాగే ఇప్పుడు చుద్దాం.

Aadhaar Card: ఫ్రీగా ఆధార్ కార్డ్ అప్‌డేట్ చేసుకున్నారా.. లేదంటే మీకే నష్టం
free Aadhaar card update till June 14th 2024

ప్రస్తుతం దేశంలో ఆధార్ కార్డ్(Aadhaar card) అత్యంత కీలక కార్డుగా మారిపోయింది. ఆధార్ కార్డ్ లేకుండా పలు రకాల స్కీమ్స్ సహా అనేక పనులు కూడా నిలిచిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఆధార్ కార్డును తప్పులు లేకుండా మార్చుకోవడం ప్రతి ఒక్కరికి తప్పనిసరి అని చెప్పవచ్చు. అంతేకాదు 10 ఏళ్లు లేదా అంతకంటే ఎక్కువ సమయం ఆధార్ కార్డ్ వివరాలు అప్‌డేట్(update) చేయకుండా ఉన్నవారు కూడా ఓసారి అప్‌డేట్ చేసుకోవాలని ఇటీవల UIDAI కోరింది. ఇందుకోసం యూఐడీఏఐ ఉచిత ఆధార్ కార్డ్ అప్‌డేట్ సౌకర్యాన్ని ప్రారంభించింది. అయితే మీరు ఇంకా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోకుంటే వెంటనే ఉపయోగించుకోండి.


దీని కోసం గడువును ఇప్పటికే పలు మార్లు పొడిగించగా(extended), ప్రస్తుతం ఉచితంగా అప్‌డేట్ చేసుకునే గడువు జూన్ 14, 2024 వరకు ఉంది. జూన్ 14లోగా ఆన్‌లైన్‌లో ఆధార్‌ను అప్‌డేట్ చేస్తే ఎలాంటి రుసుము చెల్లించాల్సిన అవసరం లేదు. మీరు ఆధార్ కేంద్రాన్ని సందర్శించి మీ సమాచారాన్ని అప్‌డేట్ చేసుకోవచ్చు లేదా మీ ఇంటి దగ్గరే ఉండి ఫోన్ లేదా ల్యాప్‌టాప్ ద్వారా కూడా మీ వివరాలను అప్‌డేట్ చేసుకోవచ్చు. అది ఎలా చేయాలో ఇక్కడ తెలుసుకుందాం.


ఇలా ఆధార్ అప్‌డేట్ చేసుకోండి

  • ముందుగా మీరు https://myaadhaar.uidai.gov.in/కి వెళ్లాలి

  • ఇప్పుడు లాగిన్‌పై క్లిక్ చేసి ఆధార్ నంబర్, క్యాప్చా ఎంటర్ చేయండి

  • ఆ తర్వాత వచ్చిన ఓటీపీని నమోదు చేయండి

  • అక్కడ అప్‌డేట్ ఆధార్ కార్డ్ ఆన్‌లైన్ ఆప్షన్‌పై క్లిక్ చేయండి

  • ఇప్పుడు డెమోగ్రాఫిక్ ఆప్షన్ కింద చిరునామాను ఎంచుకోండి

  • దీని తర్వాత మీ ఆధార్‌ను అప్‌డేట్ చేయడానికి కొనసాగించుపై క్లిక్ చేయండి

  • ఇప్పుడు మీ పత్రాల స్కాన్ కాపీని అప్‌లోడ్ చేయండి

  • దీని తర్వాత అడిగిన మిగతా సమాచారాన్ని ఇక్కడ నమోదు చేయండి

  • ఇప్పుడు పేమెంట్ ఆప్షన్ వస్తుంది

  • కానీ ఇప్పుడు ఇది జూన్ 14, 2024 వరకు ఉచితం

  • ఇప్పుడు మీ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్ జనరేట్ అవుతుంది

  • ఈ సర్వీస్ రిక్వెస్ట్ నంబర్‌ని సేవ్ చేసుకోండి

  • ఇప్పుడు పత్రాల ధృవీకరణ తర్వాత, మీ చిరునామా అప్‌డేట్ చేయబడుతుంది


ఆధార్ కార్డ్(Aadhaar card) అప్‌డేట్ కోసం కావాల్సిన పత్రాలు

  • జనన ధృవీకరణ పత్రం

  • పాస్‌పోర్ట్

  • పాఠశాల లేదా కళాశాల మార్కు షీట్ లేదా డిగ్రీ

  • పాన్ కార్డ్

  • ఓటరు గుర్తింపు కార్డు

  • 10వ తరగతి మెమో


ఇది కూడా చదవండి:

CIBIL Score: ఈ తప్పులు చేస్తున్నారా.. మీ సిబిల్ స్కోర్ ఖతం


Gold and Silver Price: మళ్లీ తగ్గిన బంగారం, వెండి..ఎంత తగ్గాయంటే


Read Latest Business News and Telugu News.

Updated Date - Apr 22 , 2024 | 01:40 PM