Share News

AP Election 2024: తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు

ABN , Publish Date - Apr 18 , 2024 | 05:18 PM

ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ(YSRCP) కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో కనగానపల్లి మండల మాజీ జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, సింగల్ విండో మాజీ డైరెక్టర్ వెంకటరాముడు, సర్పంచ్ రామకృష్ణతో కలిసి దాదాపు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో చేరాయి.

AP Election 2024: తెలుగుదేశం పార్టీలో చేరిన వైసీపీ కీలక నేతలు
YSRCP Leaders joined TDP

అనంతపురం: ఏపీ సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ (YSRCP) కి భారీ షాక్ తగిలింది. ఆ పార్టీకి కీలక నేతలు వరుసగా రాజీనామాలు చేస్తున్న విషయం తెలిసిందే. ఇదే కోవలో కనగానపల్లి మండల మాజీ జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య, సింగల్ విండో మాజీ డైరెక్టర్ వెంకటరాముడు, సర్పంచ్ రామకృష్ణతో కలిసి దాదాపు 70 కుటుంబాలు తెలుగుదేశం పార్టీ (Telugu Desam Party)లో చేరాయి. మాజీ మంత్రి పరిటాల సునీత సమక్షంలో వైసీపీ ముఖ్య నేతలు పసుపు కండువా కప్పుకున్నారు. వారిని సాదరంగా పార్టీలోకి ఆహ్వానించారు పరిటాల సునీత. వైసీపీ అరాచకాలు సహించలేకే టీడీపీలో చేరినట్లు నేతలు తెలిపారు.


AP Elections: ఏపీ ఎన్నికల్లో తొలి నామినేషన్ ఈయనదే..!

ఈ సందర్భంగా పరిటాల సునీత మాట్లాడుతూ... సైకో ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి అరాచకాలు అన్నీ ఇన్ని కావని మండిపడ్డారు. టీడీపీలోకి వచ్చిన వైసీపీ నేతలకు పరిటాల కుటుంబం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. పేరూరు ప్రాజెక్టు రాప్తాడు రైతులకు ఎంతో అవసరమని చెప్పారు. నీరు ఉంటే తమ ప్రాంత రైతులు బంగారం పండిస్తారన్నారు. టీడీపీకి వస్తున్న ఆదరణను చూసి తోపుదుర్తి ప్రకాష్ రెడ్డికి, అతని సోదరులకు పిచ్చి పట్టిందని ధ్వజమెత్తారు. జాకీ పరిశ్రమ నిర్వాహకులను ఈ ఎమ్మెల్యే రూ.15 కోట్లు డిమాండ్ చేయడంతో ఏపీ నుంచి వెళ్లిపోయిందని ఆందోళన వ్యక్తం చేశారు. అదే చోట మరో పరిశ్రమ తీసుకురావడానికి కృషి చేస్తామని పరిటాల సునీత హామీ ఇచ్చారు. ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి చేస్తున్న అరాచకాలు చూసి తోట్టుకోలేకే వైసీపీ కీలక నేతలు టీడీపీలో చేరుతున్నారని తెలుగుదేశం పార్టీ యువనేత పరిటాల శ్రీరామ్ తెలిపారు. సైకో పాలనను అంతం చేద్దామని శ్రీరామ్ పిలుపునిచ్చారు.


Sujana Chaudary: బీజేపీ అభ్యర్థిగా నామినేషన్ వేశా

అనంతరం మాజీ జెడ్పీటీసీ బిల్లే ఈశ్వరయ్య మాట్లాడుతూ... ఐదేళ్ల పాలనలో రాప్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి భూకబ్జాలు, అరాచకాలు చేయడం తప్ప అభివృద్ధి ఏం లేదన్నారు. పేరూరు డ్యామ్‌కు నీళ్లు తెస్తానని చెప్పి తుంగలో తొక్కారని మండిపడ్డారు. నా బీసీలు అని చెప్పే జగన్మోహన్ రెడ్డి.. బీసీలకు ఏం చేశారని ప్రశ్నించారు. టీడీపీ అధినేత చంద్రబాబు ఉమ్మడి జిల్లాలో మూడు సీట్లను బీసీలకు ఇచ్చారని గుర్తుచేశారు. ధర్మవరం ఎమ్మెల్యే టికెట్ పరిటాల శ్రీరామ్‌కు కాకుండా బీసీకి ఇచ్చారని.. అయినా శ్రీరామ్ సహకరిస్తున్నారని తెలిపారు. పరిటాల కుటుంబంతోనే బీసీలకు న్యాయం జరుగుతుందని ప్రకాష్ రెడ్డి చెప్పారు.


ఇవి కూడా చదవండి

Bosta: పదివేల కోట్లతో విశాఖ మరింత అభివృద్ధి.. అదే అమరావతికి పెడితే ఏం వస్తుంది?

AP Elections: పెరుగుతున్న కూటమి గ్రాఫ్.. ఆ రెండు జిల్లాల్లో వైసీపీకి నిరాశ తప్పదా..?

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 18 , 2024 | 06:14 PM