Share News

Andhra Pradesh: ఆ ఎమ్మెల్యే కక్ష రాజకీయాలతో ఎదగలేకపోతున్నా.. వైసీపీకి షాక్ ఇచ్చిన నేత..

ABN , Publish Date - Mar 25 , 2024 | 07:58 PM

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీకి వరస షాక్ లు తగులుతున్నాయి. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బొడ్డు నోబుల్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.

Andhra Pradesh: ఆ ఎమ్మెల్యే కక్ష రాజకీయాలతో ఎదగలేకపోతున్నా.. వైసీపీకి షాక్ ఇచ్చిన నేత..

ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల వేళ అధికార వైసీపీకి వరస షాక్ లు తగులుతున్నాయి. వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి బొడ్డు నోబుల్ పార్టీకి రాజీనామా చేశారు. త్వరలోనే ఆయన కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు. కాంగ్రెస్ అధిష్ఠానం ఆదేశిస్తే కైకలూరు నియోజకవర్గం ఎమ్మెల్యేగా పోటీకి సిద్ధమని చెప్పారు. 20 ఏళ్ల నుంచి రాజకీయాల్లో కొనసాగుతున్నానన్న నోబుల్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణించాక ప్రస్తుత సీఎం జగన్ తో కలిసి పని చేసినట్లు తెలిపారు. 2019లో వైసీపీని అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేశానన్నారు. కైకలూరు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు, ఆయన కుమారులు ఘోరంగా అవమానించడంతో వైసీపీను వీడాల్సిన పరిస్థితులు వచ్చాయని బొడ్డు నోబుల్ ఆవేదన వ్యక్తం చేశారు.

Telangana: చీకట్లు నింపిన హోలీ.. నదిలో స్నానానికి దిగి నలుగురు యువకులు మృతి..

" రాజకీయంగా నాకు చేయూతనివ్వాలని సీఎం జగన్మోహన్ రెడ్డి ఆలోచన చేసినా నా ఎదుగుదలకు ఎమ్మెల్యే దూలం నాగేశ్వరావు అడ్డుపడ్డారు. నన్ను రాజకీయంగా అణగదొక్కాలని ప్రయత్నించారు. రాజకీయ లబ్ధి కోసం ఎంపీపీ, జడ్పీటీసీ రిజర్వేషన్లు మార్పు చేసి దళితులను అణగదొక్కారు. దళితులను ఓటు బ్యాంకుగా వాడుకున్నారు. ఆ తర్వాత కక్ష సాధిస్తూ దళిత గ్రామాల్లో అభివృద్ధి లేకుండా చేశారు. ఎమ్మెల్యే కుమారులు రౌడీ మూకలను తయారు చేసి అన్ని వర్గాలపై దాడులు చేసి అవినీతిని ప్రోత్సహించారు."

బొడ్డు నోబుల్, వైసీపీ రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి


ఎమ్మెల్యే ఒక సమావేశంలో తనను బూతులు తిట్టారని నోబుల్ వాపోయారు. వార్డు సభ్యునిగా కూడా గెలవలేనని అవమానపరిచారు. నేను గతంలో ఎంపీటీసీగా గెలుపొందా. కాంగ్రెస్‌ బ్లాక్‌–1 అధ్యక్షునిగా పనిచేశా. అభిమానులంతా ఆశీర్వదిస్తే వచ్చే ఎన్నికల్లో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తా’నని నోబుల్‌ ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే దూషించిన మాటల ఆడియోను వినిపించడం ప్రాధాన్యత సంతరించుకుంది.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 25 , 2024 | 07:58 PM