Share News

TDP: నెల్లూరులో టీడీపీ నేతలు, అనుచరులపై వైసీపీ నేతల దాడి..

ABN , Publish Date - Jun 06 , 2024 | 12:19 PM

ఓటమి బాధ వైసీపీ నేతలను.. వారి అనుచరులను కుంగదీస్తోంది. కోట్లలో డబ్బు ఖర్చు పెట్టినా గెలవకడం మరింత బాధాకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు, అనుచరులపై దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేత, ఆయన అనుచరులు మారణాయుధాలతో దాడికి యత్నించారు

TDP: నెల్లూరులో టీడీపీ నేతలు, అనుచరులపై వైసీపీ నేతల దాడి..

నెల్లూరు: ఓటమి బాధ వైసీపీ నేతలను.. వారి అనుచరులను కుంగదీస్తోంది. కోట్లలో డబ్బు ఖర్చు పెట్టినా గెలవకడం మరింత బాధాకరంగా మారింది. ఈ నేపథ్యంలోనే టీడీపీ నేతలు, అనుచరులపై దాడులకు తెగబడుతున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరుగుతూనే ఉన్నాయి. తాజాగా నెల్లూరులో టీడీపీ కార్యకర్తలపై వైసీపీ నేత, ఆయన అనుచరులు మారణాయుధాలతో దాడికి యత్నించారు. 34వ డివిజన్ లో టీడీపీకి ఆధిక్యత రావడంతో వైసీపీ‌‌ నేతల్లో ఆగ్రహం పెల్లుబికింది. నెల్లూరులోని ప్రగతినగర్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది. తీవ్రగాయాలైన టీడీపీ కార్యకర్తలు షేక్ ఖలీల్, పటాన్ సులేమాన్‌లని చికిత్స నిమిత్తం జీజీహెచ్‌కి తరలించారు. ప్రధాన నిందితుడు, వైసీపీ నేత రియాజ్‌ని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి బాధితులని పరామర్శించారు.

రంగంలోకి దిగిన ఏపీ గవర్నర్..!


అధికారం కోల్పోయామనే అక్కసుతో ఆంధ్రప్రదేశ్‌లో వైసీపీ శ్రేణులు రెచ్చిపోతున్నారు. కడప జిల్లాలో మరీ దారుణం. విజయాన్ని సెబల్రేట్ చేసుకుంటున్న టీడీపీ కార్యకర్తలను సైతం వదల్లేదు. రాయచోటి ఎమ్మెల్యేగా టీడీపీ అభ్యర్థి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి గెలుపొందడంతో.. ఆయన అనుచరులు డిన్నర్ ఏర్పాటు చేశారు. ఆ డిన్నర్‌కు టీడీపీ శ్రేణులు వెళ్తుండగా వారి వాహనాలపై వైసీపీ శ్రేణులు రాళ్లు రువ్వి దాడులకు తెగబడ్డారు. టీడీపీ కార్యకర్తల వెంట ఎమ్మెల్యే రాంప్రసాద్ రెడ్డి కుమారుడు నిశ్చల్ నాగిరెడ్డి కూడా ఉన్నారు. ఈ దాడిలో ముగ్గురు టీడీపీ కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న ఎమ్మెల్యే రాంప్రసాద్, పోలీసులు.. ఘటనా స్థలికి వెళ్లారు. దాడిలో గాయపడిన బాధితులతో కలిసి రాయచోటి అర్బన్ పీఎస్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

ఈ వార్తలు కూడా చదవండి..

సీఎస్ సెలవుపై వెళ్లాలని సంకేతాలు..!

జగన్‌ను కలవని వైసీపీ ఎమ్మెల్యేలు..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 06 , 2024 | 12:19 PM