PM Modi: యువత ఆకాంక్షలు నెరవెర్చడమే లక్ష్యం
ABN , Publish Date - Jun 12 , 2024 | 04:00 PM
ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. తర్వాత సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ చేశారు.
అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరింది. తెలుగుదేశం పార్టీ అధినేత నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా, పవన్ కల్యాణ్, నారా లోకేశ్ తదితరులు మంత్రులుగా ప్రమాణం చేశారు. ప్రమాణ స్వీకార మహోత్సవానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరయ్యారు. తర్వాత సోషల్ మీడియా ఎక్స్ వేదికగా మోదీ ట్వీట్ చేశారు. ‘కూటమి ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను ఉన్నత శిఖరాలకు తీసుకెళ్లనుంది. రాష్ట్రంలోని యువత ఆకాంక్షలను నెరవేర్చేందుకు కూటమి ప్రభుత్వం కట్టుబడి ఉంది. ముఖ్యమంత్రి చంద్రబాబుకు అభినందనలు. మంత్రులందరికీ ఆల్ ద బెస్ట్ అని’ ప్రధాని మోదీ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ప్రమాణ స్వీకారానికి సంబంధించిన ఫొటోలను ప్రధాని మోదీ షేర్ చేశారు. చంద్రబాబుకు ప్రధాని మోదీ పుష్పగుచ్ఛం అందజేసి శుభాకాంక్షలు తెలియజేశారు.