Share News

Chandrababu: జగన్ అంటే అప్పుల అప్పారావు.. వైసీపీ సినిమా అయిపోయింది

ABN , Publish Date - Jan 10 , 2024 | 02:28 PM

Andhrapradesh: ఎన్టీఆర్‌కు స్ఫూర్తి గురజాడ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అన్నారు. బొబ్బిలిలో నిర్వహించిన రా.. కదలిరా సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రా.. కదలిరా నినాదం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం అని చెప్పారు. తెలుగు ప్రజలు ఐటీలో తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత టీడీపీది అని అన్నారు.

Chandrababu: జగన్ అంటే అప్పుల అప్పారావు.. వైసీపీ సినిమా అయిపోయింది

విజయనగరం: ఎన్టీఆర్‌కు స్ఫూర్తి గురజాడ అని టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు (TDP Chief Chandrababu Naidu) అన్నారు. బొబ్బిలిలో నిర్వహించిన రా.. కదలిరా సభలో చంద్రబాబు పాల్గొని ప్రసంగించారు. రా.. కదలిరా నినాదం ఐదు కోట్ల మంది ఆంధ్రుల కోసం అని చెప్పారు. తెలుగు ప్రజలు ఐటీలో తలెత్తుకొని తిరిగేలా చేసిన ఘనత టీడీపీది అని అన్నారు. తనకు కష్టం వస్తే 90 దేశాలు స్పందించాయన్నారు. రాతియుగం కావాలా ? స్వర్ణయుగం కావాలా? నిర్ణయించాలన్నారు.

టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే రాష్ట్రమంతా అన్నా క్యాంటిన్లు పునః ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. తొమ్మిది సార్లు విద్యుత్ ఛార్జీలు పెంచిన చెత్త ప్రభుత్వం వైసీపీ అంటూ మండిపడ్డారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తరువాత విద్యుత్ ఛార్జీలు పెరగవన్నారు. జగన్ అంటే అప్పుల అప్పారావంటూ వ్యాఖ్యలు చేశారు.


గంజాయి అమ్మేస్తున్నారని, మట్టి మింగేస్తున్నారని మండిపడ్డారు. జగన్‌కు పోయే రోజులు దగ్గరపడ్డాయన్నారు. పరిశ్రమలు పెడతామనే వారి నుంచి వైసీపీ నేతలు వాటాలడగటంతో పారిశ్రామికవేత్తలు పారిపోయారన్నారు. ఐదేళ్లలో 20 లక్షల ఉద్యోగాలిచ్చే బాధ్యత తనదని హామీ ఇచ్చారు. జగన్ నిరుపేద అంట? పాపం ఆయనకి డ్రాయరు కూడా లేదు అంటూ ఎద్దేవా చేశారు. జగన్‌కు ఓటేస్తే బానిసలైపోతామన్నారు.

జగన్ ఏమైన వెంకటేశ్వరస్వామా, ఏసుప్రభువా ?

మంత్రి బొత్స ఏం మాట్లాడుతారో ఆయనకే అర్ధం కాదన్నారు. ఉత్తరాంధ్రాలో వెనుకబడిన కులాలను తొక్కేసి విజయసాయిరెడ్ది, వైవీ సుబ్సారెడ్డికి వైసీపీ పట్టం కట్టిందని వ్యాఖ్యలు చేశారు. మన తాత తండ్రుల భూమి పట్టాలపై జగన్ ఫోటో పెట్టారని.. ఆయనేమైన వెంకటేశ్వరస్వామా, ఏసుప్రభువా ? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రజల ఆస్తులకు రక్షణ లేని ఏ చట్టాన్నైనా ఆమోదించమన్నారు. వైసీపీ ఓడిపోతే రాష్ట్రం గెలుస్తుందన్నారు. వైసీపీ సినిమా అయిపోయిందన్నారు. అందితే జుత్తు, అందకపోతే కాలు పట్టుకునే సిద్ధాంతం జగన్ ది అంటూ విరుచుకుపడ్డారు. బూతులు మాట్లాడే వైసీపీ నేతలకు బహుమానాలన్నారు. జగన్ ది రోత రాజకీయమన్నారు. ఎచ్చెర్ల ఎమ్మెల్యే దెబ్బకి సాక్షి విలేకరి ఆత్మహత్య చేసుకుంటే కేసు కూడా పెట్టలేదు సైకో అంటూ విరుచుకుపడ్డారు. తాను వచ్చిన తరువాతే రోడ్లకు మహర్ధశ వస్తుందని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు.

Updated Date - Jan 10 , 2024 | 02:28 PM