Share News

AP Elections 2024: వైసీపీ నేతల కోడ్ ఉల్లంఘన.. అడిగినందుకు ఎదురుదాడి..!

ABN , Publish Date - Mar 23 , 2024 | 09:26 AM

ఎన్నికల కోడ్ మాకు వర్తించదు.. అన్నట్లు ఉంది వైసీపీ నేతల తీరు. ఎన్నికల సంఘం ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు వైసీపీ నాయకులు. కోడ్ ఎందుకు ఉల్లంఘిస్తున్నారని అడిగితే ఎదురుదాడికి దిగడం వైసీపీకి అలవాటుగా మారింది.

AP Elections 2024: వైసీపీ నేతల కోడ్ ఉల్లంఘన.. అడిగినందుకు ఎదురుదాడి..!

ఎన్నికల కోడ్ మాకు వర్తించదు.. అన్నట్లు ఉంది వైసీపీ నేతల తీరు. ఎన్నికల సంఘం ఎన్నిసార్లు హెచ్చరించినా పట్టించుకోవడం లేదు వైసీపీ నాయకులు. కోడ్ ఎందుకు ఉల్లంఘిస్తున్నారని అడిగితే ఎదురుదాడికి దిగడం వైసీపీకి అలవాటుగా మారిపోయిందనే విమర్శలు ఉన్నాయి. వాలంటీర్లను(Volunteers) ఎన్నికల ప్రచారం, విధుల్లో ఉపయోగించకూడదని, రాజకీయ పార్టీల ప్రచారానికి దూరంగా ఉండాలని ఎన్నికల సంఘం (Election Comission) ఎన్ని హెచ్చరికలు చేసినా.. వైసీపీ నాయకులు మాత్రం చాలా చోట్ల వాలంటీర్లను తమ ప్రచారానికి వాడుకుంటున్నారు. ముఖ్యంగా ఇంటింటి ప్రచారానికి వెళ్లేటప్పుడు ఆ ఏరియా వాలంటీర్‌ను తీసుకెళ్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఎన్నికల సంఘం మాత్రం ఎట్టి పరిస్థితుల్లో నిబంధనలు పాటించాలని.. వాలంటీర్లు ఎన్నికల ప్రచారంలో పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పినా పట్టించుకోవడం లేదు.

AP Politics: చంద్రబాబు అధ్యక్షతన నేడు టీడీపీ వర్క్‌షాప్

కోడ్ ఉల్లంఘన

తాజాగా విశాఖ 77వ వార్డు వైసీపీ కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి కోడ్ ఉల్లంఘనకు పాల్పడ్డారు. అనకాపల్లి జిల్లా దేశపాత్రునిపాలెం శివారులోని తన నివాసంలో కార్పొరేటర్ వాలంటీర్లతో సమావేశమయ్యారు. డివిజన్ పరిధిలోని సుమారు 20 మంది వాలంటీర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు. వచ్చే ఎన్నికల్లో వైసీపీ గెలుపునకు సహకరించాలని, పార్టీ కోసం కష్టపడి పనిచేయాలని కార్పొరేటర్ బట్టు సూర్యకుమారి సూచించారు. ఇలా వాలంటీర్లతో సమావేశాలు పెట్టడం కోడ్ ఉల్లంఘన కిందకు వస్తుందని ఎన్నికల సంఘం ఇప్పటికే హెచ్చరించింది. అయినా వైసీపీ నాయకులు మాత్రం తరచూ కోడ్ ఉల్లంఘనకు పాల్పడుతున్నారు..

టీడీపీ, జనసేన నేతలపై దాడి..

వాలంటీర్లతో కార్పొరేటర్ సమావేశమయ్యారని తెలుసుకున్న టీడీపీ, జనసేన నాయకులు సూర్యకుమారి ఇంటికి వెళ్లారు. దీంతో వైసీపీ నేతలు వారిని అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. టీడీపీ, జనసేన నాయకులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు రాకతో వాలంటీర్లు పారిపోయారు. ఈ విషయంపై ఎన్నికల సంఘం చర్యలు తీసుకోవాలని టీడీపీ, జనసేన నేతలు కోరుతున్నారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 23 , 2024 | 09:26 AM