Share News

K. Ramakrishna: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఏపీ ప్రభుత్వం వత్తిడి పెంచాలి

ABN , Publish Date - Jan 01 , 2024 | 09:28 PM

పోలవరం, సుజల స్రవంతి, విశాఖ రైల్వే జోన్, మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని కొణతాల రామకృష్ణ చెప్పారు.

K. Ramakrishna: విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా కేంద్రంపై ఏపీ ప్రభుత్వం వత్తిడి పెంచాలి

విశాఖపట్నం: పోలవరం, సుజల స్రవంతి, విశాఖ రైల్వే జోన్, మెట్రో విషయంలో ప్రభుత్వం స్పందించడం లేదని మాజీ మంత్రి కొణతాల రామకృష్ణ ( Konatala Ramakrishna ) తెలిపారు. సోమవారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా రాష్ట్ర ప్రభుత్వం కేంద్రంపై ఒత్తిడి పెంచాలని చెప్పారు. దివంగత మాజీ ముఖ్యమంత్రి వైయస్ రాజశేఖర్‌రెడ్డి ఆశయాలకు సైతం సీఎం జగన్ తూట్లు పొడవడం సిగ్గుచేటన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా చూడాల్సిన ప్రభుత్వం అభివృద్ధిని పూర్తిగా విస్మరించిందని మండిపడ్డారు. రాష్ట్ర పరిస్థితుల్లో మార్పు జరగాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తాను ఏ పార్టీలో చేరేది ఇప్పుడే స్పష్టత ఇవ్వలేనని కొణతాల రామకృష్ణ తెలిపారు.

Updated Date - Jan 01 , 2024 | 09:28 PM