Share News

Visakha: ఏపీలో నేడు, రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ

ABN , Publish Date - May 30 , 2024 | 12:45 PM

విశాఖ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గురు, శుక్రవారాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి సునంద పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒంగోలులో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని, విశాఖలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు.

Visakha: ఏపీలో నేడు, రేపు అత్యధిక ఉష్ణోగ్రతలు: వాతావరణ శాఖ

విశాఖ: ఆంధ్రప్రదేశ్ (Andhra Pradesh) రాష్ట్రంలో గురు, శుక్రవారాలు కూడా అత్యధిక ఉష్ణోగ్రతలు(High Temparature) నమోదయ్యే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారిణి (Department of Meteorology) సునంద (Sunanda) పేర్కొన్నారు. ఈ సందర్భంగా గురువారం ఆమె మీడియాతో మాట్లాడుతూ నిన్న ఒంగోలులో 43 డిగ్రీల అత్యధిక ఉష్ణోగ్రత నమోదు అయిందని, విశాఖలో అత్యధికంగా 38 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదయిందని తెలిపారు. దక్షిణ కోస్తా, రాయలసీమలో కూడా ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయన్నారు.


నైరుతి రుతుపవనాలు కేరళ, సౌత్ తమిళనాడుకు తాకాయని, జూన్ మొదటి వారంలో ఆంధ్రప్రదేశ్‌కు నైతి రుతుపవనాలు వచ్చే అవకాశం ఉందని సునంద పేర్కొన్నారు. అంతవరకూ వరకు ఎక్కువగానే ఉష్ణోగ్రతలు నమోదు అయ్యే అవకాశం ఉందన్నారు. రుతుపవనాలు ఏపీకి తాకిన తర్వాత విస్తారంగా వర్షాలు పడతాయని సునంద తెలిపారు.


కాగా అనకాపల్లి జిల్లాలో ఎండల తీవ్రత అధికంగా ఉంది. బుధవారం ఉదయం 9 గంటల నుంచి సాయం త్రం 5 గంటల వరకు వేడి వాతావరణం కొనసాగింది. బుధవారం జిల్లాలో దాదాపు అన్ని మండలాల్లో 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో ఎండలు, ఉక్కపోతలకు జనం ఉక్కిరిబిక్కిరయ్యారు. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఎండలతో పాటు ఉక్కపోత ఉండడంతో వృద్ధులు, చిన్నారులు ఇబ్బందులు పడ్డారు. నిత్యం రద్దీగా ఉండే అనకాపల్లి మెయిన్‌రోడ్డు మధ్యాహ్నం వేళ నిర్మానుష్యంగా కనిపించింది. చోడవరంలో ఉదయం 7 గంటల నుంచే భానుడు ప్రతాపం చూపడంతో జనం బయటకు రావడానికి వెనుకంజ వేశారు. రావికమతంలో ఉదయం 9 దాటిన తరువాత జనం ఇళ్లకే పరిమితమయ్యారు. మాడుగులలో కూడా ఇదే పరిస్థితి కనిపించింది. నర్సీపట్నంలో ఎండ, ఉక్కపోతకు జనం అల్లాడిపోయారు. కోటవురట్లలో ఉదయం 10 గంటల నుంచే ప్రధాన రహదారులు సైతం నిర్మానుష్యంగా కనిపించాయి. నక్కపల్లిలో ఉదయం 8 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు ఎండ తీవ్రత అధికంగా ఉంది. పాయకరావుపేటలోనూ ఇదే పరిస్థితి ఉంది.


పాడేరు, మన్యంలో ఎండల తీవ్రత కొనసాగుతోంది. కొయ్యూరులో బుధవారం 41.3 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదైంది. ఏజెన్సీలో సైతం ఉదయం నుంచే ఎండ ప్రభావం మొదలై తొమ్మిది గంటల తరువాత నుంచి దాని తీవ్రత అధికమైంది. మధ్యాహ్నం వేళల్లో రోడ్లపై సంచరించేందుకు జనం ఇబ్బంది పడ్డారు. సాయంత్రం ఆరు గంటల నుంచి ఎండ ప్రభావం తగ్గుతున్నా, ఉక్కపోత, వేడి వాతావరణం కొనసాగింది. తాజా వేడి వాతావరణానికి ఏజెన్సీ వాసులు సైతం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. అలాగే ప్రస్తుతం రోహిణి కార్తెల ప్రభావం కావడంతో మరో ఐదు రోజులు ఎండ తీవ్రత పెరుగుతుందనే వాతావరణ శాఖ ప్రకటనలతో జనం ఆందోళన చెందుతున్నారు.


గరిష్ఠ ఉష్ణోగ్రతలు ఇలా..

మన్యంలో బుధవారం కొయ్యూరులో 41.3 డిగ్రీల సెల్సియస్‌ గరిష్ఠ ఉష్ణోగ్రత నమోదుకాగా, అరకులోయలో 36.3, చింతపల్లిలో 35.8, జి.మాడుగులలో 35.5, హుకుంపేటలో 36.4, ముంచంగిపుట్టులో 36.3, పాడేరులో 38.5, పెదబయలులో 34.3 డిగ్రీల సెల్సియస్‌గా ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.


ఈ వార్తలు కూడా చదవండి..

90 ఏళ్ల వయస్సులో రామకోటి..

హైదరాబాద్: చార్మినార్ ముందు కేటీఆర్ ధర్నా

బీఆర్ఎస్ నేతలపై కోడ్ ఉల్లంఘన కేసు..

అందుకే సీఎం నెంబర్ ఇచ్చా: రాజాసింగ్

సర్వేల అలజడి.. వైసీపీ నేతల్లో టెన్షన్..

Read Latest AP News and Telugu News

Read Latest Telangana News and National News

Read Latest Chitrajyothy News and Sports News

Updated Date - May 30 , 2024 | 12:50 PM