Share News

TDP: గంటా పోటీ చేసేది అక్కడి నుంచే... చంద్రబాబుతో భేటీలో ఇంకా ఏం చర్చించారంటే..?

ABN , Publish Date - Feb 25 , 2024 | 08:09 PM

తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఆదివారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు గంటపాటు జరిగింది. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... చీపురుపల్లి నుంచి తనను పోటీ చేయమన్నారని.. అయితే భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని తాను చంద్రబాబుకు వివరించానని తెలిపారు. తానెక్కడ పోటీ చేసినా గెలుస్తానని చంద్రబాబు చెప్పారని అన్నారు.

TDP: గంటా పోటీ చేసేది అక్కడి నుంచే... చంద్రబాబుతో భేటీలో ఇంకా ఏం చర్చించారంటే..?

అమరావతి: తెలుగుదేశం జాతీయ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడుతో మాజీ మంత్రి గంటా శ్రీనివాసరావు(Ganta Srinivasa Rao) ఆదివారం నాడు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసంలో భేటీ అయ్యారు. ఈ భేటీ దాదాపు గంటపాటు జరిగింది. ఈ సందర్భంగా గంటా శ్రీనివాసరావు మాట్లాడుతూ... చీపురుపల్లి నుంచి తనను పోటీ చేయమన్నారని.. అయితే భీమిలి లేదా విశాఖ జిల్లా నుంచి పోటీ చేస్తానని తాను చంద్రబాబుకు వివరించానని తెలిపారు. తానెక్కడ పోటీ చేసినా గెలుస్తానని చంద్రబాబు చెప్పారని అన్నారు. తనను ఎక్కడి నుంచి పోటీ చేయిస్తానోననే విషయాన్ని తనకు వదిలిపెట్టమని చంద్రబాబు చెప్పారన్నారు. టీడీపీ - జనసేన విడుదల చేసిన మొదటి జాబితాపై మంచి ఫీడ్ బ్యాక్ వస్తోందని తెలిపారు. తూర్పున సూర్యుడు ఉదయించడం ఎంత నిజమో.. వచ్చే ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడం కూడా అంతే నిజమని చెప్పారు.

తొలి జాబితాలో పేరు లేనంత మాత్రాన సీనియర్లను అవమానించినట్టు కాదని అన్నారు. పొత్తుల వల్ల కొందరికి సీట్లు దక్కకపోవచ్చని.. వారికి పార్టీ న్యాయం చేస్తుందని తెలిపారు. పొత్తులు.. సీట్ల సర్దుబాటు అనేది టీడీపీ - జనసేన పార్టీల అంతర్గత వ్యవహారమని. వైసీపీకి అంత ఊలుకు ఎందుకు..? అని ప్రశ్నించారు. వైసీపీ మునిగే నావ అని విమర్శించారు. ఏ ఒక్క వర్గమో కాదు.. ప్రతి వర్గమూ వైసీపీని వ్యతిరేకిస్తోందని చెప్పారు. వైసీపీలో ఇమడలేక చాలా మంది ఆ పార్టీని వీడుతున్నారని అన్నారు. 70 మందిని ప్రకటించడానికి వైసీపీ ఏడు లిస్టులు విడుదల చేసింది.. ఆ జాబితాల్లోనూ క్లారిటీ లేదని చెప్పారు. చంద్రబాబు తనను తిట్టారంటూ కొందరు తప్పుడు ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు. అలాంటి వారిపై పరువు నష్టం దావా వేస్తానని గంటా శ్రీనివాసరావు హెచ్చరించారు.

Updated Date - Feb 25 , 2024 | 08:44 PM