Share News

CPI: విశాఖ పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేతపై రామకృష్ణ రియాక్షన్

ABN , Publish Date - Mar 22 , 2024 | 10:44 AM

Andhrapradesh: విశాఖపట్నం పోర్టులో డ్రగ్స్ పట్టుపడటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ పట్టివేతపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడటం ఆందోళనకరమన్నారు. పోర్టులు ప్రైవేటుపరం చేయటమే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కారణమని ఆరోపించారు.

CPI: విశాఖ పోర్ట్‌లో డ్రగ్స్ పట్టివేతపై రామకృష్ణ రియాక్షన్

అమరావతి, మార్చి 22: విశాఖపట్నం పోర్టులో (visakhapatnam Port) డ్రగ్స్ (Drugs) పట్టుపడటంపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి కె.రామకృష్ణ (CPI Leader Ramakrishna) మండిపడ్డారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. డ్రగ్స్ పట్టివేతపై సమగ్ర విచారణ జరిపి, కారకులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. లక్షల కోట్ల విలువైన డ్రగ్స్ విశాఖ పోర్టులో పట్టుబడటం ఆందోళనకరమన్నారు. పోర్టులు ప్రైవేటుపరం చేయటమే మాదకద్రవ్యాల అక్రమ రవాణాకు కారణమని ఆరోపించారు. గతంలో గుజరాత్‌లోని ముంద్రా పోర్టులో విజయవాడ చిరునామాతో వేల కోట్ల విలువైన హెరాయిన్ దొరకటం గమనార్హమన్నారు. డ్రగ్స్ రాకెట్ వెనుక అధికార వైసీపీ నేతలు, పలువురు అధికారుల హస్తం ఉన్నట్లు ఆరోపణలు గుప్పుమంటున్నాయని తెలిపారు. ఏపీలో గంజాయి హవా తీవ్రంగా కనిపిస్తోందన్నారు. ఏపీలో గంజాయి, డ్రగ్స్ కలకలం యువత భవితకు ప్రశ్నార్ధకంగా మారిందన్నారు. డ్రగ్స్ సరఫరాపై సమగ్ర విచారణ జరిపి, దోషులెంతటివారైనా కఠినంగా శిక్షించాలని రామకృష్ణ డిమాండ్ చేశారు.

BJP: కమలం కసరత్తు.. నేడు అభ్యర్థులపై క్లారిటీ.. కేసీఆర్‌కు షాక్ ఇవ్వనున్న నామా?


కాగా.. విశాఖ కేంద్రంగా డ్రగ్స్‌ రవాణా తీవ్ర కలకలం రేపింది. లాసన్స్‌బే కాలనీలో గల సంధ్యా ఆక్వా ఎక్స్‌పోర్టర్స్‌ ప్రైవేటు లిమిటెడ్‌ అనే సంస్థ బ్రెజిల్‌ నుంచి ‘‘డ్రై ఈస్ట్‌’’ పేరుతో ఒక కంటెయినర్‌ తెప్పించుకోగా అందులో కొకైన్‌ ఉందని నిర్ధారణ అయ్యింది. బ్రెజిల్‌ నుంచి విశాఖపట్నం వస్తున్న కంటెయినర్‌లో 25వేల కిలోల ఈస్ట్‌తో పాటు డ్రగ్స్‌ వస్తున్నాయని ఇంటర్‌పోల్‌ నుంచి ఈ నెల 18న సీబీఐకి సమాచారం వచ్చింది. అప్పటికి రెండు రోజుల ముందే ఆ నౌక ఇక్కడి కంటెయినర్‌ టెర్మినల్‌కు చేరింది. సీబీఐ అధికారులు మరుసటిరోజే (19వ తేదీ మంగళవారం) లాసన్స్‌బే కాలనీలోని సంధ్య ఆక్వా ఆఫీసుకు వెళ్లి కంటెయినర్‌పై అనుమానాలు ఉన్నాయని విచారణకు రావాలని కోరారు. విజిలెన్స్‌ అధికారులను కూడా తీసుకువెళ్లారు. సంధ్య సంస్థ తరపున వైస్‌ ప్రెసిడెంట్‌ ఆర్‌వీఎల్‌ఎన్‌ గిరిధర్‌, ఆయనతో పాటు తోడుగా పూరీ శ్రీనివాస కృష్ణమాచార్య శ్రీకాంత్‌, కె.భరత్‌కుమార్‌లు వెళ్లారు. మంగళవారం మధ్యాహ్నం 12.30 గంటలకు అందరి ముందు కంటెయినర్‌ని తెరిచారు. అందులో ఒక్కోటి 25 కేజీల బరువున్న వేయి సంచులను 20 పాలెట్లలో సర్దారు. ఒక్కో పాలెట్‌ నుంచి ఒక సంచిని సీబీఐ అధికారులు పరీక్షించారు. వాటిలో మత్తు పదార్థం ‘కొకైన్‌’ ఉన్నట్టు పరీక్షల్లో తేలింది.

ఇవి కూడా చదవండి..

TDP Third List: టీడీపీ మూడో జాబితా విడుదల..

Arvind Kejriwal arrest: దమ్ముంటే డైరెక్ట్‌గా రండి.. బీజేపీకి ఆప్ నేతల సవాల్..!

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Mar 22 , 2024 | 10:47 AM