Share News

YS.Sharmila: స్టీల్ ప్లాంట్ విశాఖకే కాదు... ఆంధ్రాకే తలమానికం

ABN , Publish Date - Jan 24 , 2024 | 08:26 PM

కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల స్పష్టం చేశారు.

YS.Sharmila: స్టీల్ ప్లాంట్ విశాఖకే కాదు... ఆంధ్రాకే తలమానికం

కాంగ్రెస్ పార్టీ ఉన్నంత వరకు విశాఖ స్టీల్ ప్లాంట్ ను ప్రైవేటీకరణ కానివ్వబోమని కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు వైఎస్.షర్మిల స్పష్టం చేశారు. స్టీల్ ప్లాంట్ కు రాహుల్ గాంధీని తీసుకువచ్చి హామీ ఇప్పిస్తామని వెల్లడించారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టోలో పెట్టి.. ఉద్యోగాలు రాని వారికి ఉద్యోగాలు ఇస్తామని తెలిపారు. స్టీల్ ప్లాంట్ విశాఖకే కాదు ఆంధ్రాకే తలమానికమని అన్నారు.ప్లాంట్ కి కష్టాలు వస్తే కాంగ్రెస్ పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. వైఎస్.రాజశేఖర్ రెడ్డి సీఎం అయ్యాకే కర్మాగారం విస్తరణ జరిగిందని గుర్తు చేసుకున్నారు. గనులకోసం ట్రైపార్టీ అగ్రిమెంట్ వైఎస్ హయాంలోనే జరిగిందని చెప్పారు. లాభాల్లో ఉన్న ప్రాజెక్టను ప్రైవేటీకరణ చేసి అమ్ముతున్నారంటే సిగ్గు పడాలని ఘాటు వ్యాఖ్యలు చేశారు.

స్టీల్ ప్లాంట్ వంటి కంపెనీలు ఉంటేనే కార్మికులకు ఉపాధి దొరుకుతుందని వైఎస్.షర్మిల అన్నారు. ప్రభుత్వ ఆస్తులను ఇప్పటి సీఎం గాలికి వదిలేశారని ఆరోపించారు. గంగవరం పోర్ట్ ను కేవలం రూ.600 కోట్లకే అదానీకి అమ్మేశారని విమర్శించారు. నిర్వాసితులకు ఉద్యోగాలు ఇవ్వకుండా 30 వేల కుటుంబాలను రోడ్డుపై పడేశారని మండిపడ్డారు. ప్రత్యేకహోదా వస్తే రాష్ట్రానికి ఎన్నో పరిశ్రమలు వస్తాయన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు దోచుకోవడం అలవాటుగా మారిందని వైఎస్.షర్మిల ఆక్షేపించారు.

ప్రత్యేక హోదా కోసం అధికార, ప్రతిపక్షాలు పట్టించుకోవడం లేదు. వారి స్వలాభం కోసం ప్రత్యేక హోదాను తాకట్టు పెట్టాయి. ఏపీలో బీజేపీకి ఒక్క ఎమ్మెల్యే, ఎంపీ లేకపోయినా రాష్ట్రాన్ని గుప్పిట్లో పెట్టుకుంది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారం చేపడితే మొదటి సంతకం ప్రత్యేక హోదా మీదే అని రాహుల్ చెప్పారు. కాంగ్రెస్ వస్తేనే స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగుతుంది. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుంది.

వైఎస్.షర్మిల, కాంగ్రెస్ పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షురాలు

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 24 , 2024 | 08:26 PM