Share News

GVL Narasimha Rao: నీతి ఆయోగ్‌‌లో విశాఖకు స్థానం

ABN , Publish Date - Feb 12 , 2024 | 07:48 PM

బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు.

GVL Narasimha Rao: నీతి ఆయోగ్‌‌లో విశాఖకు స్థానం

విశాఖపట్నం: బహుముఖ ప్రజ్ఞశాలి, మాజీ ప్రధాని, మన తెలుగు బిడ్డ పీవీ నరసింహారావుకు కేంద్రప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించిందని.. అయితే కాంగ్రెస్ ఈ విషయంపై హర్షం ప్రకటించలేదని బీజేపీ ఎంపీ జీవీఎల్ నరసింహరావు(BJP MP GVL Narasimha Rao) అన్నారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పీవీకు భారతరత్న ఇవ్వడం ఆనంద దాయకమని చెప్పారు. విశాఖ అభివృద్ధి చెందిన నగరంగా నీతి ఆయోగ్ రోడ్డు మ్యాప్‌లో స్థానం లభించిందని తెలిపారు.

విశాఖ అభివృద్ధికి భారీగా నిధులు రాబోతున్నాయన్నారు. ఈనెల 15వ తేదీన వైజాగ్‌లో నీతి ఆయోగ్ సమావేశం జరగనుందని తెలిపారు. 404 సీట్లతో మూడోసారి బీజేపీ కేంద్రంలో అధికారంలోకి వస్తుందని ధీమా వ్యక్తం చేశారు. ఖతార్‌లో మరణ శిక్ష పడ్డ మాజీ నేవీ అధికారులకు విముక్తి కలగడం సంతోషమన్నారు. వీరిలో విశాఖకు చెందిన సుగుణాకర్ ఉన్నారన్నారు. ఢిల్లీలో రైతుల ఆందోళనలు రాజకీయ ప్రమేయంతో జరుగుతున్నాయని ఆరోపించారు. ఎన్నికల సమయంలో ఇలాంటి ఆందోళనలు ఎలాంటి ప్రభావం చూపించవని ఎంపీ జీవీఎల్ నరసింహరావు అన్నారు.

Updated Date - Feb 12 , 2024 | 10:32 PM