ToP 10: టాప్ టెన్ వార్తలు ఇవే
ABN , Publish Date - Dec 30 , 2024 | 08:59 AM
ఆంధ్రజ్యోతి.కామ్‌లోని ముఖ్యమైన పది వార్తలు మీ కోసం..
1 కొత్త సంవత్సరంలో జరగబోయే మార్పులు ఇవే..
మరో రెండు రోజుల్లో కొత్త సంవత్సరం ప్రారంభం కాబోతుంది. కేవలం క్యాలెండర్‌తో తేదీ మాత్రమే మారుతుందనుకుంటే పొరపాటు పడినట్లే. క్యాలెండర్‌లో తేదీతో పాటు కొన్నింటికి సంబంధించిన నిబంధనలు మారనున్నాయి. ముఖ్యంగా ఆర్థిక రంగంపై ప్రభావం చూపించే అంశాల్లో జరగబోయే మార్పులను తప్పకుండా తెలుసుకోవల్సి ఉంటుంది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
2 100 ఏళ్ల వయసులో అమెరికా మాజీ అధ్యక్షుడు మృతి
అమెరికా మాజీ 39వ అధ్యక్షుడు (Former US President) జిమ్మీ కార్టర్ (Jimmy Carter) 100 సంవత్సరాల వయసులో కన్నుమూశారు. అమెరికా (america) జార్జియాలోని తన స్వగృహంలో ఆదివారం రాత్రి మరణించారు. జార్జియాలోని ప్లెయిన్స్‌లో 1924లో జన్మించిన కార్టర్, 39వ అధ్యక్షుడిగా 1977 నుంచి 1981 వరకు పనిచేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
3 జగన్ ‘పోరుబాట’ రద్దు!
జగన్ అధికారంలో ఉన్నప్పుడు ఇష్టానుసారం విద్యుత్ చార్జీలు పెంచారు. విద్యార్థులకు బకాయిలు పెట్టారు. అధికారం పోయాక ఆ తప్పులను కూటమి ప్రభుత్వంపై వేస్తూ ఆందోళన బాటపట్టారు. వరుస పోరాటాలకు తేదీలను ప్రకటించిన జగన్... జనం నుంచి తగిన స్పందన రాకపోవడంతో వెనక్కి తగ్గారు. ఇటీవల రైతు పోరుబాట, విద్యుత్తు చార్జీలపై చేపట్టిన ఆందోళన కార్యక్రమాలకు ప్రజల నుంచి స్పందన కొరవడింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
4 రైతు భరోసా ఎవరికి?
కొండలు, గుట్టలు, రాళ్లు, రప్పలున్న భూములను వదిలేసి... సాగు చేస్తున్న భూములకే రైతు భరోసా ఇద్దామా? ఆదాయపు పన్ను చెల్లింపుదారుల్లో ఏయే వర్గాలను మినహాయించాలి? ఎవరికి ఇవ్వాలి? సింగరేణి ఉద్యోగులకు, నాలుగో తరగతి ఉద్యోగులకు ఇవ్వొచ్చా? ఇవ్వకపోతే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయి? వంటి పలు అంశాలపై ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క నేతృత్వంలోని మంత్రివర్గ ఉపసంఘం ఆదివారం సుదీర్ఘంగా చర్చించింది. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
5 ఒకరోజు ముందే పించన్ల పంపిణీ
ఈ నెల కూడా సామాజిక పింఛన్లను ఒక రోజు ముందే పంపిణీ చేయనున్నారు. ఈ నెల 31న ముఖ్యమంత్రి చంద్రబాబు పల్నాడు జిల్లా నరసారావుపేట నియోజకవర్గం యల్లమంద గ్రామంలో పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 10.50 గంటలకు యల్లమంద గ్రామానికి చేరుకుని 11.30 గంటల వరకు లబ్ధిదారులకు పింఛన్లు పంపిణీ చేస్తారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
6 చంద్రబాబు నాయకత్వంలో బీసీలకు మరోసారి పెద్దపీఠ..
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు (CM Chandrababu) బీసీ (BC)లకు మరో సారి పెద్దపీఠ వేశారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా బీసీ అధికారి కె.విజయానంద్ (K. Vijayanand)కు అవకాశం కల్పించారు. 1992 బ్యాచ్‌కు చెందిన బీసీ అధికారికి ముఖ్యమంత్రి చంద్రబాబు టాప్ పోస్ట్ (Top Post) ఇచ్చారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
7 ఏపీ కొత్త సీఎస్ ట్రాక్ రికార్డు ఇదే
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ తదుపరి ప్రధాన కార్యదర్శిగా (AP Chief Secretary) కె. విజయానంద్ (K.Vijayanand) నియమితులయ్యారు. ఈ మేరకు సాధారణ పరిపాలన శాఖ(పొలిటికల్) కార్యదర్శి ఎస్. సురేశ్‌కుమార్ (S. Suresh Kumar) ఆదివారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
8 రాష్ట్రంలో నాలుగు స్ట్రీట్ ఫుడ్ హబ్స్
రాష్ట్రంలో తిరుపతి, కడప, విజయవాడ, విశాఖ జిల్లాల్లో స్ట్రీట్ ఫుడ్ హబ్స్ తీసుకొస్తున్నట్లు కేంద్ర ఆయుష్, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ సహాయ మంత్రి ప్రతా్‌పరావ్ జాదవ్ తెలిపారు. ప్రజలు తీసుకునే ఆహారం శుచి, శుభ్రత కలిగి నాణ్యతగా ఉండేలా దేశ వ్యాప్తంగా వంద స్ట్రీట్‌ఫుడ్ హబ్స్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపిందని ఆయన గుర్తుచేశారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
9 న్యూ ఇయర్ ముందు మళ్లీ పెరిగిన బంగారం, వెండి రేట్లు
మీరు ఈరోజు బంగారం(gold), వెండి (silver) కొనుగోలు చేయాలని చూస్తున్నారా. అయితే ఈరోజు బంగారం రేట్లను ఓసారి తనిఖీ చేయండి మరి. ఎందుకంటే కొత్త సంవత్సరానికి ముందు బంగారం, వెండి ధరలు మళ్లీ స్వల్పంగా పెరిగాయి. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి
10 మళ్లీ నిరాశపరిచిన సీనియర్లు.. ఇబ్బందుల్లో టీమిండియా
టీమిండియా (team india), ఆస్ట్రేలియా (Australia) మధ్య జరుగుతున్న బాక్సింగ్ డే 4వ టెస్టులో ఐదో రోజు లంచ్ సమయానికి భారత్ ఇబ్బందుల్లో పడింది. ఎందుకంటే రెండో ఇన్నింగ్స్‌లో 33 స్కోరుకే 3 వికెట్లను కోల్పోయింది. దీంతో టీమిండియాకు కష్టాలు మరింత పెరిగాయి. ప్రధానంగా సీనియర్ ఆటగాళ్లైన కెప్టెన్ రోహిత్ శర్మ, విరాట్ కోహ్లీ, కేఎల్ రాహుల్ విఫలమయ్యారు. పూర్తి కథనం కోసం క్లిక్ చేయండి