Share News

AP Politics: జగన్ పాలనలో బడుగులకు రక్షణ లేదు: తెన్నేటి కృష్ణ ప్రసాద్

ABN , Publish Date - Mar 24 , 2024 | 10:06 PM

భూహక్కు చట్టం ద్వారా కూడా హత్యలు చేయడం జగన్ రెడ్డికే చెల్లిందని టీడీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్( Tenneti Krishna Prasad) అన్నారు.

AP Politics: జగన్ పాలనలో బడుగులకు రక్షణ లేదు: తెన్నేటి కృష్ణ ప్రసాద్

అమరావతి: భూహక్కు చట్టం ద్వారా కూడా హత్యలు చేయడం జగన్ రెడ్డికే చెల్లిందని టీడీపీ బాపట్ల ఎంపీ అభ్యర్థి తెన్నేటి కృష్ణ ప్రసాద్( Tenneti Krishna Prasad) అన్నారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... చేనేత కుటుంబం ఆత్మహత్య బాధాకరమని చెప్పారు. జగన్ రెడ్డి పాలనలో బడుగులకు రక్షణ లేదన్నారు. సొంత భూమి కబ్జాకి గురికావడం చూసి ఆ కుటుంబం తట్టుకోలేక ఆత్మహత్య చేసుకుందని ఆందోళన వ్యక్తం చేశారు. వైసీపీ నేతలు రాక్షసుల్లా రాష్ట్రాన్ని దోచేస్తున్నారని మండిపడ్డారు. చేనేత కుటుంబ సభ్యులకు టీడీపీ అండగా ఉంటుందని తెలిపారు. తాము అధికారంలోకి వచ్చాక నిందితులను శిక్షిస్తామని తెన్నేటి కృష్ణ ప్రసాద్ హెచ్చరించారు.

Updated Date - Mar 24 , 2024 | 10:06 PM