Share News

Nara lokesh: కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా.. ఆదుకుంటా.. నారా లోకేశ్..

ABN , Publish Date - Feb 28 , 2024 | 05:01 PM

తాము అధికారంలోకి వస్తే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు.

Nara lokesh: కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా.. ఆదుకుంటా.. నారా లోకేశ్..

తాము అధికారంలోకి వస్తే సచివాలయం, వాలంటీర్ వ్యవస్థను రద్దు చేస్తామని తప్పుడు ప్రచారం చేస్తున్నారని టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ అన్నారు. ఆ వ్యవస్థలను రద్దు చేసే ఉద్దేశం తమకు లేదని చెప్పారు. స్థానిక సంస్థలతో కలిసి వాటిని బలోపేతం చేసి పనితీరును మెరుగుపరుస్తామన్నారు. మంగళగిరి నియోజకవర్గ నేతలు, క్లస్టర్ ఇన్‌ఛార్జ్‌లతో నారా లోకేశ్ సమావేశం నిర్వహించారు. మంగళగిరిని మోడల్ నియోజకర్గంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని పేర్కొన్నారు. గత ఎన్నికల సమయంలో వైసీపీ నేతల మాయమాటలు నమ్మి ప్రజలు మోసపోయారని, ఈ సారి ఆ మాటలు నమ్మవద్దని కోరారు. రాజధాని మార్పుతో తాడేపల్లి పట్టణ, రూరల్ ప్రజలు నష్టపోయారని, తాము అధికారంలోకి వచ్చాక తాడేపల్లి, ఉండవల్లి పరిధిలో యూ1 జోన్ ఎత్తేస్తామని వివరించారు.

"ఐదేళ్లుగా విజయసాయిరెడ్డి, ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, సజ్జల రామకృష్ణారెడ్డి మంగళగిరి ప్రజలను పట్టించుకోలేదు. ఇన్ని రోజులు ఎక్కడికి వెళ్లారు.?. మళ్లీ ఎన్నికలు వచ్చేసరికి నియోజకవర్గంలో తిరుగుతున్నారు. రైతులు, స్వర్ణకారులు, చేనేత కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై నాకు స్పష్టమైన అవగాహన ఉంది. అధికారంలోకి వచ్చిన వెంటనే వారి సమస్యలు పరిష్కరిస్తాం. పని తీరు ప్రామాణికంగానే పదవులు ఇస్తాం. కష్టపడ్డ ప్రతి ఒక్కరికీ అండగా ఉంటా. ఆదుకుంటా. ఈ ప్రభుత్వం పథకాలు రద్దు చేస్తోంది. మన ప్రభుత్వం వచ్చాక మళ్లీ అందిద్దాం. గెలుస్తున్నాం అని నిర్లక్ష్యం వద్దు." అని నారా లోకేశ్ పిలుపునిచ్చారు.

మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Feb 28 , 2024 | 05:01 PM