Share News

TDP MLC : రామచంద్రయ్యకు పుత్ర వియోగం

ABN , Publish Date - Dec 29 , 2024 | 05:08 AM

మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్‌(42) శనివారం ఆకస్మికంగా మృతి చెందారు.

TDP MLC : రామచంద్రయ్యకు పుత్ర వియోగం

అమరావతి, కడప మారుతీనగర్‌, డిసెంబరు 28(ఆంధ్రజ్యోతి): మాజీ మంత్రి, టీడీపీ ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య కుమారుడు విష్ణుస్వరూప్‌(42) శనివారం ఆకస్మికంగా మృతి చెందారు. శనివారం రాత్రి రామచంద్రయ్య భార్య, కుమారుడు విష్ణు కడపకు రావాల్సి ఉంది. జనవరి ఫస్ట్‌, సంక్రాంతి పండుగలను కడపలో జరుపుకొని తిరిగి హైదరాబాద్‌కు వెళ్లాలనుకున్నారు. ఈ క్రమంలో శనివారం ఉదయం హైదరాబాద్‌లో సిద్ధం అవుతుండగా ఒక్కసారిగా విషు తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. వెంటనే స్థానిక అపోలో హాస్పిటల్‌కు తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందినట్లు రామచంద్రయ్య సోదరుడు శశికుమార్‌ వెల్లడించారు. ఆదివారం మధ్యాహ్నం కడప జిల్లా చలమారెడ్డిపల్లెలోని ఫాంహౌ్‌సలో అంత్యక్రియలు జరుగనున్నాయని వెల్లడించారు. విష్ణు మృతి విషయాన్ని తెలుసుకున్న హీరో చిరంజీవి, పలువురు నటులు, మంత్రు లు రామచంద్రయ్యను పరామర్శించారు. సీఎం చంద్రబాబు తీవ్ర దిగ్ర్భాంతి వ్యక్తం చేశారు.

పవన్‌ సంతాపం..

విష్ణుస్వరూప్‌ ఆకస్మిక మరణం దురదృష్టకరమని డిప్యూటీ సీఎం పవన్‌ కల్యాణ్‌ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

Updated Date - Dec 29 , 2024 | 05:08 AM