Share News

Tangirala Soumya: గీతాంజలి మృతిపై.. వైసీపీ అసత్య ప్రచారం

ABN , Publish Date - Mar 12 , 2024 | 09:56 PM

తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమని టీడీపీ నేత తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సజ్జా అజయ్ ట్రోల్ చేయటం వల్లే గీతాంజలి మృతి చెందిదంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు.

Tangirala Soumya: గీతాంజలి మృతిపై.. వైసీపీ అసత్య ప్రచారం

అమరావతి: తెనాలికి చెందిన గీతాంజలి మృతిపై వైసీపీ అసత్య ప్రచారం చేయడం దుర్మార్గమని టీడీపీ నేత తంగిరాల సౌమ్య అన్నారు. మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడుతూ, సజ్జా అజయ్ ట్రోల్ చేయటం వల్లే గీతాంజలి మృతి చెందిదంటూ వైసీపీ అసత్య ప్రచారం చేస్తోందన్నారు. ఈ అసత్యప్రచారాన్ని తాను తీవ్రంగా ఖండిస్తున్నట్లు చెప్పారు. రైలు ప్రమాదం వల్లే గీతాంజలి చనిపోయిందని ఎప్ఐఆర్ నమోదు చేసిన పోలీసులు.. మళ్లీ ఆత్మహత్యగా ఎందుకు ఫేక్ ఎఫ్ఐఆర్ నమోదు చేశారని ప్రశ్నించారు. గీతాంజలి ఈనెల 7వ తేదీన రైలు ప్రమాదంలో గాయపడితే.. సజ్జా అజయ్ 10 వ తేదీన వీడియోలో మాట్లాడారని గుర్తు చేశారు. గీతాంజలి నిజంగా ఆత్మహత్య చేసుకుంటే 4 రోజులుగా కేసు ఎందుకు నమోదు చేయలేదని నిలదీశారు. శవ రాజకీయాలు చేస్తున్న వైసీపీకి బుద్ధి చెప్పేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఆమె పేర్కొన్నారు.

Updated Date - Mar 12 , 2024 | 09:56 PM