Share News

AP Politics: జగన్ సర్కార్‌పై 15046 కోర్టు ధిక్కరణ కేసులు 30 వేల రిట్ పిటిషన్లు: కాలవ శ్రీనివాసులు

ABN , Publish Date - Jan 30 , 2024 | 02:57 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పరిపాలనపై దృష్టిసారించే బదులు, ప్రతిపక్ష నేతలను వేధించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు.

 AP Politics: జగన్ సర్కార్‌పై 15046 కోర్టు ధిక్కరణ కేసులు 30 వేల రిట్ పిటిషన్లు: కాలవ శ్రీనివాసులు

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై (YS Jagan) తెలుగుదేశం పార్టీ పొలిట్ బ్యూరో సభ్యుడు కాలవ శ్రీనివాసులు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. జగన్ పరిపాలనపై దృష్టిసారించే బదులు, ప్రతిపక్ష నేతలను వేధించేందుకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారని విమర్శించారు. నాలుగన్నరేళ్ల జగన్ పాలనలో 15,046 కోర్టు ధిక్కరణ కేసులు, 30 వేల రిట్ పిటిషన్లు నమోదవడంపై ఏం సమాధానం చెబుతారని ప్రశ్నించారు.

తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నాయుడుపై సీఎం జగన్ ఇన్నర్ రింగ్ రోడ్ కేసు, ఇసుక, మద్యం కేసులన్ని తప్పుడు కేసులేనని ప్రజలు గ్రహించారని కాలువ శ్రీనివాసులు తెలిపారు. ‘ఇన్నర్ రింగ్ రోడ్ కేసులో మాజీమంత్రి నారాయణకు బెయిల్ లభిస్తే, చంద్రబాబుకి లభించదు? ఒకే కేసులో ముద్దాయిలకు కోర్టులో ఒకరికి లభించిన మినహాయింపు, మరొకరికి లభిస్తుందనే విషయం ప్రభుత్వానికి తెలియదా.? ప్రజలు ఇచ్చిన అధికారంతో జగన్ రెడ్డి ప్రతిపక్షాలు, గిట్టనివారిపై రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారు. చేతిలో అధికారం, డబ్బు ఉందనే అహంకారంతో చంద్రబాబు బెయిల్ పిటిషన్‌పై సీఎం జగన్ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. జాతీయస్థాయిలో చంద్రబాబు ప్రతిష్ట దెబ్బతీయడానికే జగన్ రెడ్డి ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. చంద్రబాబుపై పెట్టిన కేసులు, చేసిన ఆరోపణల్లో ఒక్కదాన్నైనా సీఎం జగన్ నిరూపించగలిగాడా అని’ కాలువ శ్రీనివాసులు విమర్శించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Jan 30 , 2024 | 02:58 PM