Share News

Dharmana Prasad: ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన షాకింగ్ నిర్ణయం...

ABN , Publish Date - Jan 24 , 2024 | 01:27 PM

Andhrapradesh: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి.

Dharmana Prasad: ఎన్నికల్లో పోటీపై మంత్రి ధర్మాన షాకింగ్ నిర్ణయం...

శ్రీకాకుళం, జనవరి 24: ఎన్నికలు సమీపిస్తున్న వేళ మంత్రి ధర్మాన ప్రసాదరావు (Minister Dharmana Prasadrao) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో పోటీపై మంత్రి చేసిన కామెంట్స్ ఇప్పుడు చర్చనీయాంశంగా మారాయి. బుధవారం మీడియాతో మంత్రి మాట్లాడుతూ.. ఈసారి ఎన్నికల్లో పోటీ చేయాలనే ఆలోచన లేదని అన్నారు. 25 ఏళ్ళు ఎమ్మెల్యేగా పనిచేశానని.. ఇప్పుడు రెస్ట్ తీసుకుంటానని సీఎం జగన్‌కు (CM Jagan) చెప్పినట్లు తెలిపారు. రాజకీయాల్లో విసిగిపోయానన్నారు. పార్టీ కోసం తప్పకుండా పోటీ చేయాలని సీఎం జగన్ కోరుతున్నారని.. అయితే పార్టీ వ్యవహారాలు చూసుకుంటానని సీఎం‌కు చెప్పానన్నారు. అయితే అందుకు ముఖ్యమంత్రి ఒప్పుకోవడం లేదన్నారు. తన పోటీపై సీఎం జగన్‌కు ఇంకా స్పష్టత ఇవ్వలేదన్నారు.

‘‘మీకు నచ్చితే పోటీ చేస్తా...లేకపోతే తప్పుకుంటాను. 33 ఏళ్లకే మంత్రిని అయ్యాను. ప్రజలు ఏమి కోరుకుంటే అదే చేస్తా...ప్రజలు వద్దనుకుంటే పోటీ చేయను’’ అంటూ మంత్రి ధర్మాన ప్రసాదరావు పేర్కొన్నారు. ఎన్నికల్లో పోటీపై ధర్మాన అభిప్రాయంపై వైసీపీ నేతలు విస్మయం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. చివరకు పోటీకి సంబంధించి ధర్మాన ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే ఆసక్తి సర్వత్రా నెలకొంది.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..

Updated Date - Jan 24 , 2024 | 03:15 PM