Share News

Chevireddy Mohith Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డికి చుక్కెదురు

ABN , Publish Date - Jun 03 , 2024 | 01:41 PM

చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము జోక్యం చేసుకునేందుకు కరణాలేవి కనిపించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి చెబుతున్నారు.

Chevireddy Mohith Reddy: సుప్రీంకోర్టులో వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డికి చుక్కెదురు

చిత్తూరు: చంద్రగిరి నియోజకవర్గంలో ఫారం 17ఏ, ఇతర డాక్యుమెంట్ల విషయంలో మరోసారి స్క్రూటినీ చేయాలని, నాలుగు కేంద్రాల్లో రీపోలింగ్ జరపాలని వైసీపీ అభ్యర్థి చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సుప్రీంకోర్టును ఆశ్రయించారు. తాము జోక్యం చేసుకునేందుకు కరణాలేవి కనిపించడం లేదని సుప్రీంకోర్టు పేర్కొంది. పోలింగ్ రోజు చంద్రగిరి నియోజకవర్గంలో నాలుగు పోలింగ్ బూత్‌లలో అక్రమాలు జరిగాయని మోహిత్ రెడ్డి చెబుతున్నారు. ఈ విషయాన్ని హైకోర్టు దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోలేదని తెలిపారు. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో మోహిత్ రెడ్డి పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ అరవింద్ కుమార్, జస్టిస్ సందీప్ మెహతా ధర్మాసనం మోహిత్ రెడ్డి పిటిషన్‌పై విచారణ జరిపింది.

ఈ వార్తలు కూడా చదవండి..

బానిసత్వాన్ని తెలంగాణ భరించదు:సీఎం

మరో బాదుడు మొదలుపెట్టిన జగన్..

Read Latest AP News and Telugu News

Updated Date - Jun 03 , 2024 | 01:41 PM