Share News

MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై పీవీ రమేష్ వ్యంగ్యస్త్రాలు.. గట్టిగానే..!

ABN , Publish Date - May 25 , 2024 | 11:03 AM

ఈవీఎంల ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి(Rama Krishna Reddy Pinnelli) వ్యవహారంపై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్(Dr. PV Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు.

MLA Pinnelli: పిన్నెల్లి వ్యవహారంపై పీవీ రమేష్ వ్యంగ్యస్త్రాలు.. గట్టిగానే..!

అమరావతి: ఈవీఎంల ధ్వంసం కేసులో వైసీపీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణ రెడ్డి(Rama Krishna Reddy Pinnelli) వ్యవహారంపై ఆర్థిక శాఖ మాజీ కార్యదర్శి, మాజీ ఐఏఎస్ అధికారి పీవీ రమేష్(Dr. PV Ramesh) సంచలన వ్యాఖ్యలు చేశారు. పోలీసులు, రెవెన్యూ అధికారుల తీరు చూస్తుంటే ఎలుకే పిల్లిని తరుముతున్నట్లు ఉందంటూ వ్యంగ్యంగా స్పందించారు.


ఎక్స్‌లో ఆయన చేసిన పోస్టులో.. "ఏపీలో కొంత మంది అధికారులు 24 గంటలూ ఎమ్మెల్యే సేవలో తరిస్తున్నారు. లంచాల ముందు బాధ్యతలు చిన్నబోతున్నాయి. పోలింగ్ రోజు అంగ, అర్ధ బలమే పని చేసింది.అధికారులు బాధ్యత మరిచి ఎమ్మెల్యేకు సలాం చేశారు. రాజ్యాధిపత్య జాడ్యం క్యాన్సర్‌లా పాకిపోతోంది. ప్రశ్నిద్దామన్నా.. మాఫియా రాజ్యంలో ఆ ధైర్యం చేసేదెవరు? ఇలాంటి ఘటనలు ప్రజాస్వామ్యానికి ప్రమాదం" అని పోస్టులో పేర్కొన్నారు.

PV-Ramesh-Tweet.jpg

Read Latest Andhra Pradesh News and Telugu News

Updated Date - May 25 , 2024 | 12:08 PM