Share News

CM Jagan: రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ముంపు బాధితుల ఆగ్రహం

ABN , Publish Date - Mar 05 , 2024 | 10:54 PM

ప్రకాశం జిల్లాలో సీఎం జగన్(CM Jagan) రేపు (బుధవారం) పర్యటించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన విషయం తెలిసిందే.

CM Jagan: రేపు ప్రకాశం జిల్లాలో సీఎం జగన్ పర్యటన.. ముంపు బాధితుల ఆగ్రహం

ప్రకాశం: ప్రకాశం జిల్లాలో సీఎం జగన్(CM Jagan) రేపు (బుధవారం) పర్యటించనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు వద్ద పైలాన్ ఆవిష్కరించి జాతికి అంకితం చేయనున్నారు. వెలుగొండ ప్రాజెక్టు నిర్మాణం పూర్తి కాకుండానే జాతికి అంకితం చేయడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేస్తానని పాదయాత్ర సమయంలో జగన్ చెప్పిన విషయం తెలిసిందే. అధికారంలోకి వచ్చిన తర్వాత వెలుగొండ ప్రాజెక్టు‌కి నిధులు కేటాయించడం జగన్ షరామాములుగా మరచిపోయారు.గత టీడీపీ ప్రభుత్వంలో 80 శాతం వెలుగొండ ప్రాజెక్టు పనులు పూర్తి అయ్యాయి.

నాలుగేళ్ల 10 నెలల్లో రెండున్నర కిలో మీటర్లు సొరంగం పనులను వైసీపీ ప్రభుత్వం చేసింది. రెండో సొరంగంలో లైనింగ్ పనులు కూడా చేయకపోవడంతో జగన్ వైఖరిపై ప్రకాశం ప్రజలు, నిర్వాసితులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.11 ముంపు గ్రామాల ప్రజలకు ఇంకా పరిహారం అందలేదు. కాలువలు నిర్మాణం కూడా జరగకపోవడంతో ప్రజలు, నిర్వాసితులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. పనులు పూర్తి కాకుండానే వెలుగొండ ప్రాజెక్టు పూర్తి చేశామంటూ గొప్పలు చెప్పుకుంటూ రేపు పైలాన్‌ను జగన్ ఆవిష్కరిస్తున్నారు. జగన్ తీరుపై ప్రజలు, నిర్వాసితులు.ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - Mar 05 , 2024 | 10:54 PM