Share News

YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను పట్టించుకోరా?..వైసీపీ సర్కార్‌పై షర్మిల విమర్శలు

ABN , Publish Date - Jan 27 , 2024 | 11:40 AM

Andhrapradesh: గుండ్లకమ్మ ప్రాజెక్టును ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యంపట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

YS Sharmila: గుండ్లకమ్మ ప్రాజెక్ట్‌ను పట్టించుకోరా?..వైసీపీ సర్కార్‌పై షర్మిల విమర్శలు

ప్రకాశం, జనవరి 27: గుండ్లకమ్మ ప్రాజెక్టును (Gundlakamma Project) ఏపీ పీసీసీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల (APCC Chief YS Sharmila) శనివారం ఉదయం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్‌కు సంబంధించి వైసీపీ ప్రభుత్వ (YCP Government)నిర్లక్ష్యంపట్ల షర్మిల తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఆ మంత్రికి డ్యాన్సులు తప్ప.. ఏమీ పట్టించుకోరు...

జలయజ్ఞంలో భాగంగా వైఎస్ఆర్ (YSR) గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్మించారన్నారు. లక్ష ఎకరాలకు సాగు నీటితో పాటు 12 మండలాలకు తాగు నీరు ఇచ్చే ప్రాజెక్టు గుండ్లకమ్మ అని అన్నారు. 16 నెలల క్రితం ఒక గేటు, మూడు నెలల క్రితం మరో గేటు కొట్టుకుపోయిందని.. మెయింటెనెన్స్ లేక ప్రాజెక్టు గేట్లు కొట్టుకుపోయాయన్నారు. ఐదు సంవత్సరాల నుండి ప్రాజెక్టు మెయింటెనెన్స్ చేస్తే గేట్లు కొట్టుపోయేవి కాదని చెప్పుకొచ్చారు. వైఎస్ఆర్ రూ.750 కోట్లు ఖర్చు పెట్టి గుండ్లకమ్మ ప్రాజెక్టు కడితే మెయింటెనెన్స్ కోసం సంవత్సరానికి కోటి రూపాయలు కూడా వైసీపీ ప్రభుత్వం ఇవ్వలేదని విమర్శించారు.

ప్రాజెక్టు మెయింటెనెన్స్ చెయ్యని తమరు.. వైఎస్ఆర్ వారసులు ఎలా అవుతారు జగనన్న అని ప్రశ్నించారు. ఇరిగేషన్ శాఖ మంత్రి సంక్రాంతి డ్యాన్సులు చేశారు తప్ప... ప్రాజెక్టు గురించి పట్టించుకోలేదన్నారు. ఈపాపం వైసీపీ నాయకులది కాదా అని నిలదీశారు. కొట్టుకుపోయిన గేటు పైకి తేలుతూ కనిపిస్తుందంటే వైసీపీ నాయకులు సిగ్గుపడాలన్నారు. వెలుగొండ ప్రాజెక్టుకి తట్ట మట్టి కూడా వైసీపీ వెయ్యలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలో వస్తేనే ప్రత్యేక హోదా, విశాఖ స్టీల్ ప్లాంట్ వస్తాయని షర్మిల పేర్కొన్నారు.


అసలేం జరిగిందంటే...

వరద ప్రవాహానికి ఏడాది క్రితం ప్రాజెక్టు 6వ నంబర్ గేటు కొట్టుకుపోయిన విషయం తెలిసిందే. అయితే ఏడాది గడిచినప్పటికీ గేటు ఏర్పాటు చేయడంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించింది. తాజాగా రెండు నెలలు క్రితం మూడో నెంబర్ గేట్ సైతం కొట్టుకుపోయింది. రెండు టీఎంసీల నీళ్లు వృధాగా సముద్రంలోకి వెళ్లాయి. గుండ్లకమ్మ ప్రాజెక్టు ఖాళీ కావడంతో నీళ్ళు లేక ఆయకట్టు రైతులు, ప్రజలు. ఆందోళన చెందుతున్నారు. ప్రాజెక్టుకి కొత్త గేట్లు ఏర్పాటు చేయటంలో జగన్ ప్రభుత్వం నిర్లక్ష్యం వహించడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వ తీరుని నిరసిస్తూ వైఎస్ షర్మిల ప్రాజెక్టును సందర్శించారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Jan 27 , 2024 | 11:40 AM