Veeranjaneyaswamy: అంతా చేసి ఏమీ ఎరుగనట్టు ధర్నాలా.. సిగ్గు చేటు
ABN , Publish Date - Dec 27 , 2024 | 12:06 PM
Andhrapradesh: ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరుగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని జగన్‌పై మంత్రి వీరాంజనేయస్వామి మండిపడ్డారు. తాను పెంచిన చార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య. ఏపీఈఆర్‌సీ అనుమతించిన దాని కన్నా రూ.19 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు.

ప్రకాశం, డిసెంబర్ 27: నాడు ముఖ్యమంత్రిగా జగన్ (Former minister YS Jaganmohan Reddy) చేసిన పాపాలు నేటికీ రాష్ట్ర ప్రజలను వెంటాడుతూనే ఉన్నాయని మంత్రి బాల వీరాంజనేయ స్వామి (Minister Bala Veeranjaneya swamy) విమర్శలు గుప్పించారు. శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ... ప్రజలపై నాడు విద్యుత్ భారాలు మోపి నేడు ఏమీ ఎరుగనట్టు ధర్నాలకు పిలుపునివ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. తాను పెంచిన చార్జీలపై తన పార్టీ శ్రేణులతోనే ధర్నాలు చేయించడం సైకో చర్య. ఏపీఈఆర్‌సీ అనుమతించిన దాని కన్నా రూ.19 వేల కోట్లు అదనంగా విద్యుత్ కొనుగోళ్లకు ఖర్చు చేయడం వాస్తవం కాదా అని ప్రశ్నించారు. యూనిట్ రూ.5 లకే వచ్చే విద్యుత్‌ను కమీషన్ల కోసం బహిరంగ మార్కెట్‌లో రూ.8 నుంచి రూ.14 కు కొనుగోలు చేసింది జగన్ కాదా అని నిలదీశారు. జగన్ తన అవినీతిని ప్రజలపై సర్దుబాటు ఛార్జీల రూపంలో భారం మోపేందుకు నాడే ఏపీఈఆర్‌సీ అనుమతి కోరింది వాస్తవం కాదా అని అడిగారు.
జగన్ అవినీతి, ధన దాహం వల్లే ప్రజలపై విద్యుత్ భారం పడిందన్నారు. ఇవ్వన్నీ తెలిసి కూడా దొంగే దొంగ అన్నట్టు జగన్ తీరు ఉందంటూ విమర్శలు గుప్పించారు. పవర్ చార్జీలు పెంచినందుకే జగన్‌కు ప్రజలు పవర్ పీకేశారన్న విషయం జగన్ తెలుసుకోవాల్నారు.. జగన్ ఇకనైనా ప్రజలను మోసం చేయడం మానుకొని వాస్తవాలు గ్రహించాలని మంత్రి బాల వీరాంజనేయ స్వామి హితవుపలికారు.
JC: ఎక్కడా తలవంచేది లేదు.. జేసీ సంచలన ప్రెస్‌మీట్
జగన్‌ది తుగ్లక్ చర్యే: మంత్రి గొట్టిపాటి
కూటమి ప్రభుత్వంపై వైసీపీ నాయకులు అసత్య ఆరోపణలు చేస్తున్నారని విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ మండిపడ్డారు. విద్యుత్ చార్జీల పెంపు ప్రతిపాదన జగన్ రెడ్డి హయాంలోనే జరిగిందని తెలిపారు. వైసీపీ అధికారంలో ఉన్నప్పుడే చార్జీలను పెంచాలని డిస్కంలు ఈఆర్సీని కోరాయన్నారు. 10 సార్లు విద్యుత్ చార్జీలు పెంచిన వైసీపీకి ధర్నా చేసే నైతిక హక్కు లేదని అన్నారు. జగన్ విద్యుత్ చార్జీలు పెంచాలని ప్రతిపాదించి.. నేడు వాటిపై ధర్నాలు చేయడం తుగ్లక్ చర్య అంటూ మంత్రి గొట్టిపాటి రవికుమార్ విమర్శలు గుప్పించారు.
TG News: పోలీసుల ఆత్మహత్య.. అంతుచిక్కని మిస్టరీ
వైసీపీ నిరసనలు...
కాగా.. కరెంట్ చార్జీల పెంపునకు నిరసగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా వైసీపీ పోరుబాటకు దిగింది. విశాఖపట్నంలోని గురుద్వార్ జంక్షన్ నుంచి ఏపీఈపీడీసీఎల్ కార్యాలయం వరకు వైసీపీ నేతల పాదయాత్ర చేపట్టారు. మాజీమంత్రి గుడివాడ అమర్నాథ్, వైసీపీ నేతలు ఈ పాదయాత్రలో పాల్గొన్నారు. అలాగే ఉమ్మడి కడప జిల్లాలో వైసీపీ నిరసన ర్యాలీలు చేపట్టింది. పులివెందుల్లో ఎంపీ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించారు. విద్యుత్ చార్జీల పెంపుకు నిరసనగా వైసీపీ నేతలు ర్యాలీలు నిర్వహించారు.
ఇవి కూడా చదవండి...
Fake Currency: ఏపీలో రెండు జిల్లాల్లో దొంగ నోట్ల కలకలం
గుర్తుపెట్టుకోండి.. జనవరి 1 నుంచి మారేవి ఇవే..
Read Latest AP News And Telugu news