Share News

AP News: అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యం... నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు

ABN , Publish Date - Apr 06 , 2024 | 05:18 PM

ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పెన్షన్ల పంపిణీలో వలంటీర్లు జోక్యం చేసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశించింది. దీంతో ఏపీలో పింఛన్ల (AP Pensions) పంపిణీ కొంత ఆలస్యం అయింది.

AP News: అందుకే పింఛన్ల పంపిణీ ఆలస్యం...  నిమ్మగడ్డ రమేష్ కీలక వ్యాఖ్యలు

అమరావతి: ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికల కోడ్ నేపథ్యంలో పింఛన్ల పంపిణీపై గందరగోళ పరిస్థితులు నెలకొన్న విషయం తెలిసిందే. పెన్షన్ల పంపిణీలో వలంటీర్లు జోక్యం చేసుకోవద్దని కేంద్ర ఎన్నికల సంఘం (Central Election Commission) ఆదేశించింది. దీంతో ఏపీలో పింఛన్ల (AP Pensions) పంపిణీ కొంత ఆలస్యం అయింది.

ఈ కారణంతో పలుచోట్ల వృద్ధులు ఇబ్బందులు పడ్డారు. అయితే ఇందుకు ప్రత్యామ్నయంగా ఏపీ ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పింఛన్ల పంపిణీకి ఇబ్బందులు రాకుండా చర్యలు తీసుకుంటోంది. అయితే ఈ విషయంపై రాష్ట్ర ఎన్నికల సంఘం విశ్రాంత ఐఏఎస్‌ అధికారి, సిటిజన్స్‌ ఫర్‌ డెమొక్రసీ (సీఎఫ్‌డీ) ప్రధాన కార్యదర్శి నిమ్మగడ్డ రమేష్ కుమార్ (Nimmagadda Ramesh) కీలక వ్యాఖ్యలు చేశారు.

చర్యలు తీసుకోవాలి

ఏపీలో పింఛన్ల పంపిణీ ఆలస్యానికి కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని ఏపీ ఎన్నికల ప్రధాన అధికారి ముకేష్ కుమార్ మీనాను నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు. శనివారం నాడు సీఈఓ మీనాను నిమ్మగడ్డ రమేష్ కుమార్, మాజీ సీఎస్ ఎల్వీ సుబ్రహ్మణ్యం వెలగపూడిలోని సచివాలయంలో కలిశారు.

రాష్ట్రంలో 65 లక్షల మంది పెన్షన్ లబ్ధిదారులు ఉన్నారన్నారు. వలంటీర్లతో సంబంధం లేకుండా పెన్షన్ పంపిణీ చేయాలని కేంద్ర ఎన్నికల కమిషన్ ఆదేశించిందని తెలిపారు. వలంటీర్లతోనే పెన్షన్లను పంపిణీ చేయించాలని కొందరు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం వేశారని చెప్పారు.


YS Jagan: మళ్లీ తెర మీదకు అదే రాజకీయం..!

వారి వాదనపై హైకోర్టు విస్మయాన్ని వ్యక్తం చేసిందన్నారు. సకాలంలో పింఛన్ల పంపిణీ చేయాలని హైకోర్టు ఆదేశించిందని చెప్పారు. పింఛన్ల పంపిణీని ఉద్దేశ పూర్వకంగా ఆలస్యం చేశారని మండిపడ్డారు. పింఛన్లకు కావాల్సిన రూ. 2 వేల కోట్ల నిధులను మొదట పక్కదారి పట్టించడంతోనే ఆలస్యం చేశారన్నారు. ఈ ఆలస్యానికి కారకులు ఎంతటి వారైనా చర్యలు తీసుకోవాలని సీఈఓను కోరినట్లు చెప్పారు. పింఛన్ల పంపిణీలో నిర్లక్ష్యం చేసిన సీఎస్ జవహర్ రెడ్డి , మిగతా వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు.


Yanamala: జగన్ మళ్లీ అధికారంలోకి వస్తే.. ఇక అధోగతే

ఇప్పటి వరకు 94 % పెన్షన్ల పంపిణీ పూర్తి అయ్యిందని సీఈఓ తెలిపారని చెప్పారు. పెన్షన్ల పంపిణీ ఎందుకు ఆలస్యం అయ్యిందో వాస్తవాన్ని గుర్తించాలని.. అందుకు కారణమైన వారిపై చర్యలు తీసుకోవాలని అన్నారు. మే నెలలో ఏపీ ఎన్నికలు జరుగుతుండటంతో అత్యంత ప్రధానమైనదని చెప్పారు. కనుక మే నెలలో పెన్షన్లు ఆలస్యం కాకుండా చూడాలని కోరినట్లు చెప్పారు. మే 1 వ తేదీన లబ్ధిదారులు అందరికీ పింఛన్లు అందేటట్లుగా చూడాలన్నారు. వచ్చే నెల కూడా ఈసీ ఆలోచించి చర్యలు తీసుకోవాలని నిమ్మగడ్డ రమేష్ కుమార్ కోరారు.


Sajjala: ఆ వృద్ధులు చనిపోయింది ప్రమాదవశాత్తూ మాత్రమే.. చంద్రబాబుపై సజ్జల విమర్శలు

మరిన్ని ఏపీ వార్తల కోసం...

Updated Date - Apr 06 , 2024 | 05:34 PM