Share News

TDP: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వీరే..

ABN , Publish Date - Feb 05 , 2024 | 08:07 AM

అమరావతి: రానున్న ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు.

TDP: ఉమ్మడి నెల్లూరు జిల్లాలో టీడీపీ అభ్యర్థులు వీరే..

అమరావతి: రానున్న ఎన్నికల నేపథ్యంలో సీట్ల సర్దుబాటుపై టీడీపీ-జనసేన చర్చలు కొలిక్కి వస్తున్నాయి. జనసేనకు కేటాయించే సీట్లపై దాదాపు స్పష్టత వచ్చింది. అలాగే తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు టీడీపీ అభ్యర్థులను ఎంపిక చేస్తున్నారు. ఈ క్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏడు సీట్లలో అభ్యర్థులను ఖరారు చేశారు.

నెల్లూరు... పొంగూరు నారాయణ,

నెల్లూరు రూరల్... కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి,

ఆత్మకూరు... ఆనం రామనారాయణ రెడ్డి,

సర్వేపల్లి... సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి,

వెంకటగిరి.... కురుగుండ్ల రామకృష్ణ,

గూడూరు.... పాశం సునీల్ కుమార్

కావలి.... కావ్య కృష్ణారెడ్డి

ఉదయగిరి, కొవ్వూరు సూళ్లూరుపేట నియోజకవర్గాలపై కసరత్తు కొనసాగుతోంది. ఉమ్మడి నెల్లూరు జిల్లా కావలి టీడీపీ ఇంఛార్జిగా కావ్య కృష్ణారెడ్డిని నియమించారు. కావలి టౌన్ పార్టీ అధ్యక్షుడిగా గుత్తికొండ కిషోర్ బాబును నియమించారు. ఈ మేరకు ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడు నియామక ఉత్తర్వులు విడుదల చేశారు.

ఈ వార్త కూడా చదవండి.. జనసేనకు కేటాయించిన నియోజకవర్గాలివే!

Updated Date - Feb 05 , 2024 | 08:07 AM