Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలు

ABN , Publish Date - Mar 04 , 2024 | 10:24 AM

మాజీ మంత్రి నారాయణ అనుచరుల ఇళ్లపై వరసగా పోలీసులు దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా నేత ముప్పాళ్ల విజేతరెడ్డి ఇంట్లో రెండు గంటలపాటు పోలీసులు జల్లెడ పట్టారు. రూ.20వేలు మాత్రమే ఉండటంతో చేసేదేమిలేక వెనుదిరిగారు. విజేత ఇంటి వద్దకి వెనువెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు.

Kotamreddy Sridhar Reddy: కోటంరెడ్డి ఇంటిపై పోలీసుల సోదాలు

నెల్లూరు: మాజీ మంత్రి నారాయణ (Ex Minister Narayana) అనుచరుల ఇళ్లతో పాటు ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి (Kotamreddy Sridhar Reddy) నివాసంపై పోలీసులు (Police) వరసగా దాడులు చేస్తున్నారు. భారీ సంఖ్యలో పోలీసులు వారి ఇళ్లను చుట్టుముట్టి మరీ సోదాలు నిర్వహిస్తున్నారు. మహిళా నేత ముప్పాళ్ల విజేతరెడ్డి ఇంట్లో రెండు గంటలపాటు పోలీసులు జల్లెడ పట్టారు. రూ.20వేలు మాత్రమే ఉండటంతో చేసేదేమిలేక వెనుదిరిగారు. విజేత రెడ్డి ఇంట్లో సోదాలు ముగిసిన వెంటనే ఎమ్మెల్యే కోటంరెడ్డి శ్రీధర్ రెడ్డి చేరుకున్నారు. పోలీసుల తీరుపై కోటంరెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. మరో నేత కోట గురుబ్రహ్మం నివాసాన్ని పోలీసులు చుట్టుముట్టారు. రెండు గంటల నుంచి సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

Updated Date - Mar 04 , 2024 | 10:24 AM