Share News

MA Sharif: సీఎం జగన్ ఆఫీసులోకి కంటైనర్ ఎందుకెళ్లింది..?

ABN , Publish Date - Mar 28 , 2024 | 10:52 PM

ఓటమి భయంతోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్(MA Sharif) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆఫీసులోకి కంటైనర్ ఎందుకు వెళ్లింది? అని ప్రశ్నించారు. సజ్జల చెబుతున్నట్టు పాంట్రీ కంటైనర్ అయితే అంత రహస్యంగా లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అని నిలదీశారు.

MA Sharif: సీఎం జగన్ ఆఫీసులోకి కంటైనర్ ఎందుకెళ్లింది..?

అమరావతి: ఓటమి భయంతోనే ఏపీ ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అవాకులు, చెవాకులు పేలుతున్నారని మండలి మాజీ చైర్మన్ ఎం.ఏ షరీఫ్(MA Sharif) అన్నారు. గురువారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ.. సీఎం ఆఫీసులోకి కంటైనర్ ఎందుకు వెళ్లింది? అని ప్రశ్నించారు. సజ్జల చెబుతున్నట్టు పాంట్రీ కంటైనర్ అయితే అంత రహస్యంగా లోపలికి తీసుకెళ్లాల్సిన అవసరం ఏంటి? అని నిలదీశారు. సీఎం ఇంటిలోకి నిబంధనలు అతిక్రమించి వెళ్లి వచ్చిన కంటైనర్‌ని ఎందుకు తనిఖీ చేయలేదు? అని ప్రశ్నించారు.

ఆఫీసులో గంటసేపు ఏం లోడింగ్ చేశారో చెప్పాలని, ఈ విషయంపై ఎన్నికల కమిషన్ విచారణ జరిపి వాస్తవాలు వెల్లడించాలని కోరారు. టీడీపీ చీఫ్ చంద్రబాబు రాబోయే ఎన్నికల్లో గెలిస్తే సంక్షేమ పథకాలు ఆగిపోతాయని వైసీపీ తప్పుడు ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. వైసీపీ మాయ మాటలు ప్రజలు నమ్మెద్దని చెప్పారు. చంద్రబాబు అమలు చేసిన సంక్షేమ పథకాలు రద్దు చేసింది వైసీపీ కాదా? అని నిలదీశారు. అన్న క్యాంటీన్లు మూసివేసి పేదల కడుపు కొట్టింది ఎవరు? అని ప్రశ్నించారు. 130 కి పైగా సంక్షేమ పథకాలు రద్దు చేసి బడుగు, బలహీన వర్గాలకు ద్రోహం చేసింది వైసీపీ కాదా? అని నిలదీశారు. రాష్ట్రాభివృద్ది, పేదల సంక్షేమం చంద్రబాబుతోనే సాధ్యమని తెలిపారు. వైసీపీ పని అయిపోయిందని.. ఆ పార్టీని బంగాళాఖాతంలో కలిపేందుకు ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎం.ఏ షరీఫ్ అన్నారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 28 , 2024 | 10:52 PM