Share News

Chandrababu Naidu: ట్రెండింగ్‌లో చంద్రబాబు.. దేశం మొత్తం ఇదే చర్చ..!

ABN , Publish Date - Jun 05 , 2024 | 06:28 PM

Chandra Babu Naidu in Trending: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు(Lok Sabha Election Results) వచ్చేశాయ్. అయితే, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh New CM) కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu Naidu) వరంలా మారింది.

Chandrababu Naidu: ట్రెండింగ్‌లో చంద్రబాబు.. దేశం మొత్తం ఇదే చర్చ..!
Chandrababu Naidu

Chandra Babu Naidu in Trending: లోక్‌సభ ఎన్నికల ఫలితాలు(Lok Sabha Election Results) వచ్చేశాయ్. అయితే, ఏ పార్టీకి మేజిక్ ఫిగర్ దక్కకపోవడంతో.. పరిస్థితి సంక్లిష్టంగా మారింది. ముఖ్యంగా ఈ పరిస్థితి ఆంధ్రప్రదేశ్(Andhra Pradesh New CM) కాబోయే ముఖ్యమంత్రి, టీడీపీ అధినేత చంద్రబాబుకు(Chandrababu Naidu) వరంలా మారింది. అవును.. ఈ కారణంగానే ఆయన నేషనల్ సెంటర్ ఆఫ్ ఎట్రాక్షన్‌గా మారారు. దేశ వ్యాప్తంగా ఏ నోట విన్నా.. చంద్రబాబు పేరే హాట్‌ డిస్కస్‌గా మారింది. సోషల్ మీడియాలోనూ ఆయన పేరే ట్రెండ్ అవుతోంది.


కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేయాలంటే చంద్రబాబు మద్దతు తప్పనిసరి. బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే ప్రభుత్వం ఏర్పడాలంటే టీడీపీ ఎంపీల మద్ధతు తప్పనిసరి. అందుకే.. చంద్రబాబు నిర్ణయంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఈ క్రమంలోనే ఆయన పేరు దేశ వ్యాప్తంగా మారుమోగిపోతోంది. సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లలో చంద్రబాబు పేరు టాప్‌లో ట్రెండ్ అవుతుందంటే.. పరిస్థితి ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు.


చంద్రబాబు ఎటువైపు..

వాస్తవానికి ఏపీలో కూటమి గెలవడానికి ప్రధాని నరేంద్ర మోదీ, అమిత్ షా ద్వయం కూడా ఎంతో కృ‌షి చేశారు. ఏపీలో భారీగా ప్రచారం నిర్వహించారు. చంద్రబాబు, పవన్‌కు అండగా నిలిచారు. దీన్ని దృష్టిలో ఉంచుకునే చంద్రబాబు కీలక ప్రకటన చేశారు. తాను ఎన్డీయే కూటమిలోనే ఉన్నానని.. ఉంటానని స్పష్టం చేశారు. ఏమైనా మార్పులు ఉంటే అప్పుడు చెబుతానని చంద్రబాబు స్పష్టం చేశారు.


అవకాశాన్ని వొదలొద్దు..

ఇదిలాఉంటే.. రాష్ట్రాభివృద్ధి విషయంలో చంద్రబాబుకు ఇది మంచి అవకాశం అని.. ఈ అవకాశాన్ని వదులుకోవద్దని ఏపీ ప్రజలు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ముఖ్యంగా ఏపీకి ప్రత్యేక హోదా, పోలవరం ప్రాజెక్టు, రాజధాని అమరావతి అభివృద్ధి, వైజాగ్ స్టీల్ ప్లాంట్, రాష్ట్రాలకు నిధుల కోసం కేంద్రాన్ని డిమాండ్ చేయాలని అభిప్రాయపడుతున్నారు ప్రజలు. మరి రానున్న రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందో.. చంద్రబాబు ఏం చేస్తారనేది వేచి చూడాలి.

For More Andhra Pradesh and Telugu News..

Updated Date - Jun 05 , 2024 | 06:28 PM