Share News

Lanka Dinakar: వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి

ABN , Publish Date - Mar 18 , 2024 | 03:54 PM

వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్(Lanka Dinakar) తెలిపారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పది లక్షల మంది ప్రజల స్వచ్ఛంద సహకారంతో నిన్న (ఆదివారం) బొప్పూడి వద్ద జరిగిన ‘ప్రజాగర్జన’తో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) తట్ట బుట్ట సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ నాలుగు ‘సిద్ధం’ సభల్లో అధికార, ప్రజాధన దుర్వినియోగం చేశారని మండిపడ్డారు.

Lanka Dinakar: వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి

అమరావతి: వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే ఏపీలో డబుల్ ఇంజన్ సర్కార్ రావాలని బీజేపీ ముఖ్య అధికార ప్రతినిధి లంకా దినకర్(Lanka Dinakar) తెలిపారు. సోమవారం నాడు బీజేపీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ... పది లక్షల మంది ప్రజల స్వచ్ఛంద సహకారంతో నిన్న (ఆదివారం) బొప్పూడి వద్ద జరిగిన ‘ప్రజాగర్జన’తో సీఎం జగన్ రెడ్డి (CM Jagan) తట్ట బుట్ట సర్దుకునే పనిలో నిమగ్నమయ్యారని ఎద్దేవా చేశారు. జగన్ నాలుగు ‘సిద్ధం’ సభల్లో అధికార, ప్రజాధన దుర్వినియోగం చేశారని మండిపడ్డారు. ఎన్డీఏ మొదటి ‘ప్రజాగర్జన’ సభకు ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారని తెలిపారు. ప్రధాని మోదీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు , జనసేన చీఫ్ పవన్ కళ్యాణ్ ఒకే వేదిక మీద కనపడగానే 2014లో కంటే .. 2024లో భారీ మెజార్టీతో ఎన్డీఏ గెలుస్తుందని జగన్ రెడ్డి, అతని అనుచరులు భయపడిపోతున్నారని చెప్పారు. రాష్ట్రంలో దుష్ట శిక్షణ, శిష్ట రక్షణ కోసం త్రిమూర్తులు ఏకం కావాలని రాష్ట్రంలో ప్రజలు కోరుకుంటున్నారని చెప్పారు. ప్రస్తుతం రాష్ట్రంలో ప్రజలను అవినీతి, అరాచక పాలన నుంచి రక్షించుకొని సమ్మిళిత అభివృద్ధి దిశగా ఎన్డీఏ పాలనలో అడుగులు పడాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నారన్నారు.

జగన్ పాలనలో మద్యం మాఫియా చెలరేగిపోయింది

మోదీ సంకల్పించిన వికసిత భారత్‌లో భాగంగా వికసిత ఆంధ్రప్రదేశ్ కావాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ అవసరమని చెప్పారు. ఆంధ్రప్రదేశ్‌లో ప్రస్తుత జగన్ ట్రబుల్ ఇంజన్ సర్కార్ పోయి.. దేశంలో అభివృద్ధి, సంక్షేమానికి చిరునామా అయిన డబుల్ ఇంజన్ సర్కార్ అనివార్యమని అన్నారు. రాష్ట్రానికి ఇప్పుడున్న అవినీతి, అరాచక, విధ్వంసక పాలన ప్రమాదం నుంచి కాపాడుకోడానికి మూడు పార్టీలు పనిచేస్తున్నాయని అన్నారు. 2018లో జరిగిన పొరపాటు ఒక్క ఛాన్స్ అంటే ఒక్క చుక్క విషమని ప్రజలు గమనించలేక పోయారన్నారు. ఇప్పుడు రాష్ట్రానికి అమృతం లాంటి ఎన్డీఏ పాలన అవసరమని చెప్పారు. 2019లో మధ్య నిషేధం , రైతు ధరల స్థిరీకరణ నిధి, యువతకు పరిశ్రమల ద్వారా ఉపాధి అన్న జగన్ ఇప్పుడు ఏమి సమాధానం చెబుతారని ప్రశ్నించారు. జగన్ పాలనలో మద్యం మాఫియాతో, ల్యాండ్, సాండ్, మైన్ మాఫియా పెట్రేగి పోయిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో వనరుల దోపిడీ తప్ప ప్రజలకు ఆరోగ్య వంతమైన వసతులు ఏమీ కల్పించారో చెప్పలేక వ్యక్తిగత విమర్శలకు వైసీపీ బరితెగిస్తోందని లంకా దినకర్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇవి కూడా చదవండి

Dhulipalla Narendra: రాష్ట్ర ప్రభుత్వంపై ఉన్న ప్రజాగ్రహం స్పష్టంగా కనిపించింది

AP Politics: ప్రధాని సభపై కుట్ర.. ఆ అధికారులపై చర్యలు తీసుకోవాలన్న జనసేన..?

AP Politics: ‘ప్రజాగళం’ సభలో పోలీసుల సహాయ నిరాకరణపై కూటమి సీరియస్

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి

Updated Date - Mar 18 , 2024 | 03:54 PM