Share News

TDP: బీసీలను జగన్ ప్రభుత్వం విస్మరించింది.. టీడీపీ నేతల ఆగ్రహం

ABN , Publish Date - Feb 25 , 2024 | 05:20 PM

టీడీపీ - జనసేన అభ్యర్థుల ఎంపికలో బీసీలకు టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నూలు జిల్లా అంటేనే బీసీలు గుర్తుకువస్తారని తెలిపారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకూ బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తోందని అన్నారు.

TDP: బీసీలను జగన్ ప్రభుత్వం విస్మరించింది.. టీడీపీ నేతల ఆగ్రహం

కర్నూలు: టీడీపీ - జనసేన అభ్యర్థుల ఎంపికలో బీసీలకు టీడీపీ అధినేత చంద్రబాబు న్యాయం చేస్తున్నారని మాజీ మంత్రి కేఈ ప్రభాకర్ తెలిపారు. ఆదివారం నాడు ఆయన మీడియాతో మాట్లాడుతూ... కర్నూలు జిల్లా అంటేనే బీసీలు గుర్తుకువస్తారని తెలిపారు. తెలుగుదేశం ఆవిర్భావం నుంచి నేటి వరకూ బీసీలకు అన్ని విధాలుగా న్యాయం చేస్తోందన్నారు. బీసీలు అంతా టీడీపీకి అండగా ఉండి..చంద్రబాబును మళ్లీ సీఎం చేసుకోవాలని కేఈ ప్రభాకర్ పిలుపునిచ్చారు.

టీడీపీలో బీసీలకు న్యాయం: టీజీ భరత్

బీసీలకు ఏ పార్టీలో లభించని న్యాయం టీడీపీలో లభిస్తోందని కర్నూలు టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తెలిపారు. విజన్ ఉన్న నేత చంద్రబాబు అని బీసీల కోసం ఒక విజన్‌తో ప్రణాళిక రూపొందించారని చెప్పారు. టీడీపీ అధికారంలోకి రాగానే బీసీలను ఆదుకుంటారని తెలిపారు. బీసీలు అంతా ఒక్కటిగా ఉండి.. చంద్రబాబును ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. సొంత తల్లి, చెల్లికి న్యాయం చేయలేని జగన్.. బీసీలకు ఏం న్యాయం చేస్తారని ప్రశ్నించారు. రాష్ట్రంలో ఉన్న బీసీలు ఓటు వేసే ముందు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలని టీజీ భరత్ అన్నారు.

బీసీల పార్టీ టీడీపీ: బీటీ నాయుడు

బీసీలకు దివంగత ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావు పెద్దపీఠ వేశారని టీడీపీ ఎమ్మెల్సీ, జిల్లా అధ్యక్షుడు బీటీ నాయుడు తెలిపారు. పార్టీ పరంగా..పదవుల పరంగా బీసీలకు సముచిత స్థానం కల్పించారని అన్నారు. టీడీపీ అధినేత చంద్రబాబు అంతకు మించి బీసీలకు న్యాయం చేస్తున్నారని తెలిపారు. సీఎం, వైసీపీ అధినేత జగన్ బీసీలను గొర్రెల కన్నా హీనంగా చూస్తున్నారని విమర్శించారు. పనికి మాలిన ఉపయోగం లేని కార్పొరేషన్‌లను జగన్ ఏర్పాటు చేశారని మండిపడ్డారు. టీడీపీ అంటేనే బీసీలు..బీసీల పార్టీ టీడీపీ అని చెప్పారు. జగన్‌ కొంతమంది బీసీలకు పదవులు ఇచ్చినా.. వారు కూర్చోడానికి కుర్చీలు కూడా లేవని బీటీ నాయుడు ఎద్దేవా చేశారు.

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Feb 25 , 2024 | 05:42 PM