Share News

Fire Accident: నంద్యాల జిల్లా: ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం

ABN , Publish Date - Apr 18 , 2024 | 07:31 AM

నంద్యాల జిల్లా: ఆత్మకూరు పట్టణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం జరిగింది. నగరంలోని రఘునాథ్ సెంటర్‌లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్‌లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లోనుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు.

Fire Accident: నంద్యాల జిల్లా:  ఆత్మకూరులో భారీ అగ్ని ప్రమాదం

నంద్యాల జిల్లా: ఆత్మకూరు (Atmakur) పట్టణంలో గురువారం తెల్లవారుజామున భారీ అగ్ని ప్రమాదం (Fire Accident) జరిగింది. నగరంలోని రఘునాథ్ సెంటర్‌లో ఓ పాత ఇనుప సామాను గోడౌన్‌లో భారీగా మంటలు వ్యాపించాయి. మంటల్లోనుంచి భారీ శబ్దాలు రావడంతో స్థానికులు భయభ్రాంతులకు గురయ్యారు. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. సంఘటన ప్రదేశానికి చేరుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.


ఈ వార్తలు కూడా చదవండి..

భద్రాచలంలో శ్రీ రామ మహా పట్టాభిషేక మహోత్సవం

ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం..

Updated Date - Apr 18 , 2024 | 07:32 AM