Share News

Diamonds: లక్కంటే ఇదే.. పొలంలో వజ్రాలు లభ్యం

ABN , Publish Date - May 27 , 2024 | 11:56 AM

ఆంధ్రప్రదేశ్‌లో కొందరు రైతుల పంట పండింది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా కొందరికి వజ్రాలు దొరికాయి. విక్రయిస్తుండగా రూ.లక్షల్లో నగదు వస్తోంది. ఆ అన్నదాతల ఆనందం మొహంలో వెల్లివిరుస్తోంది. కర్నూలు, అనంతపురం సరిహద్దుల్లో వర్షాకాలం పంట సమయంలో వజ్రాలు కనిపిస్తుంటాయి. వజ్రాల కోసం ఆ ప్రాంత రైతులు, రైతు కూలీలు పొలంలో గాలిస్తుంటారు.

Diamonds: లక్కంటే ఇదే.. పొలంలో వజ్రాలు లభ్యం
Kurnool farmers get 3 diamonds

ఆంధ్రప్రదేశ్‌లో కొందరు రైతుల పంట పండింది. ప్రతి సీజన్ మాదిరిగానే ఈ సారి కూడా కొందరికి వజ్రాలు దొరికాయి. విక్రయిస్తుండగా రూ.లక్షల్లో నగదు వస్తోంది. ఆ అన్నదాతల ఆనందం మొహంలో వెల్లివిరుస్తోంది. కర్నూలు, అనంతపురం సరిహద్దుల్లో వర్షాకాలం పంట సమయంలో వజ్రాలు కనిపిస్తుంటాయి. వజ్రాల కోసం ఆ ప్రాంత రైతులు, రైతు కూలీలు పొలంలో గాలిస్తుంటారు.

కర్నూలు మే 27: కర్నూలు జిల్లా (Kurnool district) తుగ్గలి మండలం జొన్నగిరిలో రైతులకు వజ్రాలు కనిపించాయి. పొలంలో వ్యవసాయ పనులు చేస్తుండగా మూడు వజ్రాలు దొరికాయి. దీంతో ఆ అన్నదాతలు తెగ సంబరపడ్డారు. ఆ మూడు వజ్రాల (diamonds) విలువ 20 లక్షల వరకు ఉంటుందని స్థానిక వ్యాపారి అంచనా వేశారు. ఆ రైతులకు డబ్బు అవసరం ఉందో ఏమో 15 తులాల బంగారం ఇస్తే స్థానిక వ్యాపారికి ఇచ్చేశారు. వజ్రాలు దొరికినప్పటికీ తక్కువ ధరకు విక్రయించారు.

గత వారం రోజుల్లో వజ్రాలు దొరకడం ఇది ఐదోసారి. పొలం పనులు చేస్తుండగా జొన్నగిరి, మదనంతపురం, పగిడిరాయి, దేశాయి తండా రైతులకు 10 వజ్రాలు దొరికాయి. అప్పటినుంచి వజ్రాల కోసం స్థానికులతోపాటు పక్క గ్రామాల వారు వజ్రాల వేటకు వెళుతున్నారు. తమకు వజ్రాలు దొరకుతాయాని ఆశగా ఎదురు చూస్తున్నారు. వారి కోరిక ఫలిస్తుందో లేదో చూడాలి.

వజ్రాల వేట కోసం పొలంలో వెతుకుతున్న రైతులు వ్యాపారుల చేతిలో మోసపోతున్నారు. సోమవారం రైతులకు మూడు వజ్రాలు లభించగా తక్కువ ధరకే విక్రయించారు. రైతుల అవసరాన్ని స్థానిక వ్యాపారి క్యాష్ చేసుకున్నారు.

Read Latest
Andhra Pradesh News and Telugu News

Updated Date - May 27 , 2024 | 01:10 PM