Share News

AP NEWS: విజయవాడలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. కారణమిదే..?

ABN , Publish Date - Mar 05 , 2024 | 03:48 PM

విజయవాడలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఓ కేసు వాయిదా కోసం కోర్టుకు గన్నవరం టీడీపీ (TDP), వైసీపీ నేతలు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ నేతలు కోర్టు ఆవరణలో అలజడి సృష్టించారు.

AP NEWS: విజయవాడలో మరోసారి రెచ్చిపోయిన వైసీపీ మూకలు.. కారణమిదే..?

విజయవాడ: విజయవాడలో మరోసారి వైసీపీ (YSRCP) మూకలు రెచ్చిపోయారు. విజయవాడలోని ఏసీబీ కోర్టులో టీడీపీ నేతలపై విచక్షణ రహితంగా దాడికి తెగబడ్డారు. ఓ కేసు వాయిదా కోసం కోర్టుకు గన్నవరం టీడీపీ (TDP), వైసీపీ నేతలు వచ్చారు. ఈ సమయంలో వైసీపీ నేతలు కోర్టు ఆవరణలో అలజడి సృష్టించారు. అక్కడ ఎమ్మెల్యే వల్లభనేని వంశీ (Vallabhaneni Vamsi) అనుచరులు దౌర్జన్యానికి దిగారు. టీడీపీ నేత యార్లగడ్డ వెంకట్రావు(Yarlagadda Venkatarao) అనుచరులను వంశీతో వచ్చిన వైసీపీ శ్రేణులు అడ్డుకున్నారు. నెల రోజుల్లో అందరనీ ఏరి పారేస్తామంటూ టీడీపీ నేతలను బెదిరించారు. ఇప్పటికే ఆలస్యం అయిందని, ఇక ఊరుకునేది లేదంటూ వైసీపీ మూకలు హెచ్చరించాయి.

గతంలో వంశీతో తిరిగిన తమనే బెదిరిస్తారా అని వెంకట్రావు వర్గీయులు నిలదీశారు. ఎమ్మెల్యే వంశీ ఆదేశాలతో వెంకట్రావు వర్గీయులను సూర్యారావుపేట పోలీస్టేషన్‌కి పోలీసులు తరలించారు. చంపుతామని బెదిరించిన వైసీపీ కార్యకర్తలను వదిలి తమను ఎందుకు పోలీస్ స్టేషన్‌కు తీసుకొచ్చారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకుని గన్నవరం నుంచి యార్లగడ్డ వెంకట్రావు సూర్యారావుపేట పోలీస్టేషన్‌కి బయలుదేరారు. వెంకట్రావుతో పాటు టీడీపీ నాయకులు కూడా అక్కడకు చేరుకుంటున్నారు. వైసీపీ మూకలు తమను చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిని వెంటనే అరెస్టు చేసి, ప్రాణ రక్షణ కల్పించాలని సీపీకి టీడీపీ నేతలు విజ్ఞప్తి చేశారు.

ఇవి కూడా చదవండి...

మరిన్ని ఏపీ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి...

Updated Date - Mar 05 , 2024 | 03:48 PM