Share News

Chandrababu: హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోంది

ABN , Publish Date - Jan 07 , 2024 | 01:23 PM

ఎన్టీఆర్ జిల్లా: జగన్‌రెడ్డి రివర్స్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని, హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని అన్నారు.

Chandrababu: హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోంది

ఎన్టీఆర్ జిల్లా: జగన్‌రెడ్డి రివర్స్‌ పాలనలో ఆంధ్రప్రదేశ్ 30 యేళ్లు వెనక్కిపోయిందని, హైదరాబాద్‌ వెలిగిపోతుంటే.. అమరావతి వెలవెలపోతోందని తెలుగుదేశం అధినేత నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. తెలుగుజాతి గ్లోబల్‌ నాయకులుగా ఎదిగేందుకు టీడీపీ ఉపయోగపడిందని అన్నారు. ఆదివారం తిరువూరులో జరుగుతున్న ‘రా.. కదిలి రా’ బహిరంగ సభలో పాల్గొన్న చంద్రబాబు మాట్లాడుతూ.. ప్రపంచంలో ఏ మూలకు వెళ్లిన కృష్ణా జిల్లా వాసులు ఉంటారని, అవకాశాలు అందిపుచ్చుకోవడంలో వాళ్ళు టాప్ అని, కృష్ణాజిల్లా వాసులు ప్రపంచమంతా విస్తరించారని కొనియాడారు.

ప్రపంచంలో తెలుగు జాతి నెంబర్ వన్‌గా ఉండాలనేదే తన ఆకాంక్ష అని, 25 సంవత్సరాల క్రితం తాను పిల్లలకు ఇచ్చిన ఆయుధం ఐటి అని చంద్రబాబు వ్యాఖ్యానించారు. తనను అక్రమంగా అరెస్టు చేసి జైల్లో ఉంచినప్పుడు ప్రపంచమంతా సంఘీభావంగా నిలిచిందన్నారు. ఒకపక్క హైదరాబాద్ వెలిగిపోతుంటే... సీఎం జగన్ చర్యల వల్ల అమరావతి వెలవెలబోతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ రివర్స్ చర్యల వల్ల రాష్ట్రం 30 ఏళ్లు వెనక్కి పోయిందన్నారు. ప్రతి ఒక్కరూ ‘రా కదలిరా’ అంటూ నారా చంద్రబాబు తిరువూరు సభ వేదికగా పిలుపునిచ్చారు.

అంతకుముందు తిరువూరు చేరుకున్న చంద్రబాబుకు ఎన్టీఆర్ జిల్లా టీడీపీ-జనసేన నేతలు ఘనస్వాగతం పలికారు. ఉమ్మడి కృష్ణా జిల్లాతో పాటు, తెలంగాణ సరిహద్దు కావటంతో.. ఖమ్మం జిల్లా నుంచి టీడీపీ శ్రేణులు పెద్దఎత్తున తరలి వచ్చారు. జగ్గయ్యపేట, నందిగామ, మైలవరం, విజయవాడ, గన్నవరం, గుడివాడ నియోజకవర్గాల నుంచి భారీగా వాహనాలతో నేతలు ప్రదర్శనగా సభాస్థలికి చేరుకున్నారు. అయితే చంద్రబాబు సభకు వెళ్లే కార్లను లక్ష్మీపురం వద్ద బారికేడ్లను పెట్టి పోలీసులు కార్లను నిలిపివేస్తున్నారు.

Updated Date - Jan 07 , 2024 | 01:23 PM